Union Bank SO Recruitment: బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్..నెలకు రూ.85 వేల జీతం, అప్లై చేశారా..
ABN , Publish Date - Apr 30 , 2025 | 02:20 PM
బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలు ప్రొఫెషనల్, స్పెషలిస్టు ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఉన్నాయి.
బ్యాంకు ఉద్యోగాల కోసం చూస్తున్న యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలోనే తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేసేందుకు గల అర్హతలు ఏంటి, ఎప్పటి వరకు సమయం ఉంది, వేతనం ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోస్ట్ పేరు అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250 ఉద్యోగాలు, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) 250 ఉద్యోగాలు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 పోస్టులకు విద్యార్హత
బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ 2025 కోసం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో B.Tech/B.E., CA, CS, ICWA, M.Sc, M.E./M.Tech, MBA/PGDM, MCA, PGDBM లలో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. దీంతోపాటు కనీస వయసు 22 సంవత్సరాలు ఉండగా, గరిష్టంగా 30 సంవత్సరాలు కల్గి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా వయస్సు సడలింపు ఉంటుంది. కాబట్టి మీకు ఈ అర్హతలు ఉంటే వెంటనే ఈ పోస్టలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నియామకంలో పురుషులు, మహిళలు ఇద్దరూ ఆన్‌లైన్ మోడ్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.
ఫీజు ఎంతంటే..
దీని కోసం ఫీజు జనరల్ కేటగిరీకి రూ.1180, ST, ST, PH కేటగిరీ అభ్యర్థులు రూ.177 చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI వంటి సేవలైన ఆన్‌లైన్ మోడ్ ద్వారా రుసుము చెల్లించుకోవచ్చు. ఇక జీతం విషయానికి వస్తే ఈ నియామకంలో నెలకు రూ. 48,480 నుంచి రూ. 85,480 వరకు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులను పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకునే ముందు అందరు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు ఏప్రిల్ 30న నోటిఫికేషన్ విడుదల కాగా, మే 20,2025 వరకు చివరి తేదీ ఉంది.
ముఖ్యమైన పత్రాలు
ఈ కొత్త నియామకాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అన్ని పత్రాలను కలిగి ఉండాలి. 10వ తరగతి మార్కుల సర్టిఫికెట్, 12వ తరగతి మార్కుల మెమో.. కుల, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్ ID, ఒక ఫోటో ఖాళీ కాగితంపై సంతకం, B.Tech/BE, CA, CS, ICWA, M.Sc, M.E/M.Tech, MBA/PGDM, MCA, PGDBM మార్కుల సెట్ మీ దగ్గర అన్ని ఈ పత్రాలు ఉంటే, మీరు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
Central Government: జాతీయ భద్రతా సలహా బోర్డును ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం
Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Read More Business News and Latest Telugu News