Share News

SSC CGLE 2025: కొత్త ఫీడ్‌బ్యాక్ పోర్టల్ లాంచ్.. అభ్యర్థులకు మరో అవకాశం.!

ABN , Publish Date - Sep 20 , 2025 | 06:04 PM

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఫీడ్‌బ్యాక్ పోర్టల్‌ను ప్రారంభించింది. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా సమీక్షిస్తోంది. అంతేకాకుండా..

SSC CGLE 2025: కొత్త ఫీడ్‌బ్యాక్ పోర్టల్ లాంచ్.. అభ్యర్థులకు మరో అవకాశం.!
SSC CGLE

ఇంటర్నెట్ డెస్క్: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (CGL) Tier-1 పరీక్షను ఇటీవల కంప్యూటర్ బేస్డ్‌ టెస్ట్‌గా నిర్వహించింది. అయితే, ఈ పరీక్ష సమయంలో చాలా మందికి సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల కారణంగా చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ తమ అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inలో ప్రత్యేక ఫీడ్‌బ్యాక్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.


ఆధికారిక ప్రకటన ప్రకారం, ssc.gov.in వెబ్‌సైట్‌లో అభ్యర్థి ఈ పోర్టల్‌ ద్వారా లాగిన్ అయి పరీక్ష సమయంలో తలెత్తిన సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో దాదాపు 10,000 ఫిర్యాదులు అందాయని కమిషన్ పేర్కొంది. అందులో 2,000 మందికి పైగా అభ్యర్థులు తమ పరీక్ష సమయంలో సిస్టమ్ పదే పదే రీస్టార్ట్ అవటం, ప్రశ్నలు కనిపించకపోవటం, నెట్‌వర్క్ సమస్యలు వంటివి ఎదురయ్యాయని వివరించారు.


రీ ఎగ్జామ్‌

ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా పరిశీలిస్తున్న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ప్రాంతీయ కార్యాలయాలు ఆయా ఫిర్యాదులను క్రాస్ చెక్ చేస్తున్నాయి. ఒకవేళ ఫిర్యాదులు నిజమైనవిగా తేలితే, అటువంటి అభ్యర్థులకు మరోసారి పరీక్ష రాసే అవకాశం ఇవ్వనుంది. రీ ఎగ్జామ్‌ను సెప్టెంబర్ 26న లేదా అంతకు ముందు నిర్వహించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలో అధికారికంగా విడుదలవుతుంది. కాబట్టి, ఫిర్యాదు చేసిన అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను అభ్యర్థి పోర్టల్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని SSC కోరింది.


Also Read:

సింగరేణి ఉద్యోగులకు దసరా ఆఫర్..

ట్రంప్ హెచ్-1బీ వీసా ప్రకటన.. అమాంతం పెరిగిన భారత్-అమెరికా విమాన టిక్కెట్ల ధరలు

For More Latest News

Updated Date - Sep 20 , 2025 | 06:38 PM