Share News

SKU : వర్సిటీకి సున్నం

ABN , Publish Date - Aug 10 , 2025 | 12:23 AM

మార్కులు తక్కువగా వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి.. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లో దిద్దుకునే విద్యార్థులను చాలామంది చూసి ఉంటారు. సున్నాలు చుట్టడం, సున్నాను ఎనిమిదిగా మార్చడం, ఒకటిని ఏడుగా మార్చడం.. ఇలాంటి బురిడీ కొట్టించే సన్నివేశాలు చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు. ఇలాంటివి పాఠశాల స్థాయిలో చిన్నారులు చేసే చిలిపి చేష్టలుగా...

SKU : వర్సిటీకి సున్నం
Sri Krishnadevaraya University

ఫీజు చెల్లింపు చలానాల్లో తేడాలు

తక్కువ చెల్లించి.. సున్నాలు చేర్చి మాయ

పరిశీలనలో వెలుగులోకి విద్యార్థుల అక్రమాలు

విచారణకు కమిటీ వేసిన ఎస్కేయూ అధికారులు

అనంతపురం రూరల్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): మార్కులు తక్కువగా వచ్చినప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి.. ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌లో దిద్దుకునే విద్యార్థులను చాలామంది చూసి ఉంటారు. సున్నాలు చుట్టడం, సున్నాను ఎనిమిదిగా మార్చడం, ఒకటిని ఏడుగా మార్చడం.. ఇలాంటి బురిడీ కొట్టించే సన్నివేశాలు చాలా సినిమాల్లో కూడా చూసే ఉంటారు. ఇలాంటివి పాఠశాల స్థాయిలో చిన్నారులు చేసే చిలిపి చేష్టలుగా భావిస్తారు. ఇలాంటి పనులే కాలేజీ స్థాయిలో చేస్తే..? అందులోనూ ఫీజులు కట్టే చలానాల్లో సున్నాలు చేర్చి.. వందలను వేలుగా మారిస్తే..? నేరమని తెలియక చేశారని క్షమించాలా..? దండించి.. దారిలో పెట్టాలా..?


ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోగానీ.. ఎస్కేయూలో జరిగిన ఈ ‘మస్కా’ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వర్సిటీ అధికారులు విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు.

పరిశీలనలో వెలుగులోకి..

ఎస్కేయూ ఫార్మసీ కళాశాలకు కొందరు విద్యార్థులు ఫీజుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ప్రవేశ సమయంలో వసతి గృహాల్లో చేరే విద్యార్థులు ఫీజులను బ్యాంకుల్లో చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. చలానా పత్రాలను వసతి గృహ కార్యాలయం, కాలేజీలో సమర్పించాలి. ఇదే అదనుగా కొందరు తక్కువ ఫీజు చెల్లించి.. రిసి్‌ప్టలో సున్నాలను చేర్చి.. ఎక్కువ ఫీజు చెల్లించినట్లు బురిడీ కొట్టించారు. కాలేజీలో సమర్పించిన రిసి్‌ప్టలలో సున్నాలు చేర్చిన విషయం వెలుగులోకి వచ్చింది. వర్సిటీలో కళాశాలలు, వసతి గృహాలు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఫీజులు, ఇతర ధ్రువ పత్రాల పరిశీలన జరుగుతోంది. ఈ సమయంలో బోగస్‌ చలానాల అంశం బయటపడినట్లు తెలుస్తోంది. వసతి గృహం, ట్యూషన ఫీజు రిసిప్ట్‌ వెరిఫికేషనలో అదనపు సున్నాలను గుర్తించారు. వాటిని తీసుకుని బ్యాంకులో విచారించారు. చలానాల్లో తేడాలు నిజమేనని నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నాతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చలానాలు మాన్యువల్‌ కావడంతో విద్యార్థులు ఈ విధంగా బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది.

జీరో బిజినెస్‌..!

కళాశాల అధికారులు, సిబ్బందిని కొందరు విద్యార్థులు సున్నాలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఓ విద్యార్థి రూ.500 ఫీజు చెల్లించి.. చలానా రిసి్‌ప్టలో మూడు సున్నాలను అదనంగా చేర్చాడు. ఇలా ఏకంగా రూ.50 వేలు చెల్లించినట్లు కాలేజీలో చూపించాడు. మరో విద్యార్థి రూ.1400 చలానా కట్టాడు. ఒక సున్నా అదనంగా చేర్చి.. రూ.14 వేలు చెల్లించినట్లు రిసిప్ట్‌ సమర్పించాడు. కళాశాలలో మరో ముగ్గురు విద్యార్థులు ఇలా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఒక్క ఫార్మసీ కళాశాలలోనే కాదని, విశ్వవిద్యాలయంలోని పలు కళాశాల్లో ఇలాంటివి ఉన్నాయని సమాచారం. దీంతో వర్సిటీ ఉన్నతాధికారులు పూర్తిస్ధాయి విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఆ విద్యార్థులు, కొందరు సంఘాలవారు వర్సిటీ ఉన్నతాధికారులను కలిసినట్లు తెలిసింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని నాయకులు కోరినట్లు తెలుస్తోంది.

ఆరుగురితో కమిటీ..

విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో బోగస్‌ చలానాలను గుర్తించాము. రిసి్‌ప్టలో సున్నాలు చేర్చి కాలేజీలో అందజేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిస్తున్నాం. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. ఫార్మసీ కళాశాలతో పాటు బీఈడీ, ఇంజనీరింగ్‌ తదితర కళాశాలల్లోనూ కమిటీ సభ్యులు విచారిస్తారు. నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటాము.

-రమేష్‌ బాబు, రిజిసా్ట్రర్‌, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Aug 10 , 2025 | 12:43 AM