Share News

IBPS PO 2025: ఈ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేశారా.. కొత్త పరీక్షా విధానం గురించి తెలుసా

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:56 PM

మీరు బ్యాంకింగ్ రంగంలో జాబ్ కోసం చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఇటీవల IBPS ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇదే సమయంలో పరీక్షా విధానంలో కూడా మార్పు చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

IBPS PO 2025: ఈ బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేశారా.. కొత్త పరీక్షా విధానం గురించి తెలుసా
IBPS PO 2025

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు మంచి ఛాన్స్ వచ్చేసింది. ఇటీవల IBPS.. 5208 పీఓ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా, వీటి కోసం అప్లై చేసుకునేందుకు అభ్యర్థులకు గడువు తేదీ దగ్గర పడింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 21, 2025గా ఉంది. అయితే ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి, ఎగ్జామ్ తేదీ ఎప్పుడనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


వయో పరిమితి

ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేయాలి. వారి వయస్సు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థి జూలై 02, 1995కి ముందు, జూలై 01, 2005 తర్వాత జన్మించి ఉండకూడదు. OBC అభ్యర్థులకు వయోపరిమితిలో మూడు సంవత్సరాలు సడలింపు, SC, ST కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు సడలింపు ఇస్తారు. దరఖాస్తు రుసుము జనరల్/OBC/EWS అభ్యర్థులకు రూ. 850 కాగా, SC/ST/PH వారికి రూ. 175 చెల్లించాలి.


IBPS PO రిక్రూట్‌మెంట్ ముఖ్యమైన తేదీలు

  • రిజిస్ట్రేషన్, ఫీజు సమర్పణకు చివరి తేదీ: జూలై 21, 2025

  • ప్రీలిమినరీ అడ్మిట్ కార్డ్ విడుదల: ఆగస్టు 2025

  • ప్రీలిమినరీ పరీక్ష: ఆగస్టు 2025

  • ప్రీలిమినరీ పరీక్ష ఫలితాలు: సెప్టెంబర్ 2025

  • మెయిన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్: సెప్టెంబర్/అక్టోబర్ 2025

  • మెయిన్స్ ఎగ్జామ్: అక్టోబర్ 2025

  • మెయిన్స్ పరీక్ష ఫలితాలు: నవంబర్ 2025

  • పర్సనాలిటీ టెస్ట్: నవంబర్/డిసెంబర్ 2025

  • ఇంటర్వ్యూ: డిసెంబర్ 2025/జనవరి 2026

  • జాబ్ కేటాయింపు: జనవరి/ఫిబ్రవరి 2026


ప్రిలిమ్స్ ఎగ్జామ్ విధానంలో మార్పు..

ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించడం ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇదే సమయంలో IBPS PO 2025 ప్రిలిమినరీ పరీక్షలో పలు మార్పులు చేయబడ్డాయి. ఈసారి ప్రిలిమినరీ పరీక్ష సబ్జెక్టుల మార్కుల పంపిణీ మార్పు చేశారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (మ్యాథమెటికల్ ఎబిలిటీ) మార్కులను 35 నుంచి 30కి తగ్గించగా, రీజనింగ్ ఎబిలిటీ మార్కులను 30 నుంచి 40కి పెంచారు. కానీ ప్రిలిమినరీ పరీక్ష మొత్తం వ్యవధి, ప్రశ్నల సంఖ్యలో మాత్రం ఎలాంటి మార్పు లేదు.


మెయిన్స్ పరీక్షలో కూడా..

మెయిన్స్ పరీక్షలో రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ ప్రశ్నల సంఖ్యను 45 నుంచి 40కి తగ్గించారు. పరీక్షా వ్యవధిని 2024లో 60 నిమిషాల నుంచి 50 నిమిషాలకు తగ్గించారు. దీంతోపాటు జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్ సబ్జెక్టుల వెయిటేజ్ ఎక్కువగా ఉంది. కానీ తక్కువ ప్రశ్నలు ఉన్నాయి. ఈ సబ్జెక్టులు 50 మార్కులకు, 35 ప్రశ్నలు ఉంటాయి.

పరీక్ష సమయం కూడా 35 నిమిషాల నుంచి 25 నిమిషాలకు తగ్గించబడింది. డేటా అనాలిసిస్, ఇంటర్‌ప్రెటేషన్ విధానాన్ని కూడా తగ్గించారు. గత సంవత్సరం 60 మార్కులతో పోలిస్తే ఈసారి 50గా మార్పు చేశారు. మెయిన్స్ పరీక్ష మొత్తం ఆబ్జెక్టివ్ ప్రశ్నల సంఖ్యను 155 నుంచి 145కి తగ్గించారు. మొత్తం పరీక్ష సమయం కూడా గత సంవత్సరం 180 నిమిషాల నుంచి 160 నిమిషాలకు తగ్గించారు.


ఎంపిక ప్రక్రియ

ప్రిలిమ్స్‌ పరీక్షలో స్కోర్ ఆధారంగా అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అర్హులైన అభ్యర్థులను మూడో దశ వ్యక్తిత్వ పరీక్షకు పిలుస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారిని చివరకు ఇంటర్వ్యూకు పిలిచి సెలక్ట్ చేస్తారు.


ఇవి కూడా చదవండి


యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 04:06 PM