Share News

AgniVeer Vayu Jobs: 17 ఏళ్ల వారికే కేంద్రంలో జాబ్ ఆఫర్స్.. నెలకు రూ.40 వేల జీతం

ABN , Publish Date - Jul 05 , 2025 | 03:05 PM

భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయుగా (AgniVeer Vayu Jobs) చేరాలనుకునే యువతకు మంచి ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు 17 ఏళ్ల యువకులు సైతం అప్లై చేసుకోవచ్చు. వీటికి ఎంపికైతే ఏడాది దాదాపు రూ.40 వేల వరకు వేతనం వస్తుంది.

AgniVeer Vayu Jobs: 17 ఏళ్ల వారికే కేంద్రంలో జాబ్ ఆఫర్స్.. నెలకు రూ.40 వేల జీతం
AgniVeer Vayu Jobs

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. భారత వైమానిక దళం అగ్నివీర్‎ వాయు కోసం 02/2026 రిక్రూట్‌మెంట్ అధికారిక నోటిఫికేషన్‌ను (AgniVeer Vayu Jobs) విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా యువతకు దేశ సేవలో భాగమయ్యే అవకాశం లభిస్తుంది. ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూలై 11, 2025 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 31, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు.


ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 11, 2025

  • దరఖాస్తు చివరి తేదీ: జూలై 31, 2025

  • పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25, 2025

దరఖాస్తు రుసుము

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ: రూ. 550/-

  • దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.

వయస్సు పరిమితి

  • కనిష్ట వయస్సు: 17.5 సంవత్సరాలు

  • గరిష్ట వయస్సు: 21 సంవత్సరాలు

  • పుట్టిన తేదీలు: జూలై 2, 2005 నుంచి జనవరి 2, 2009 మధ్య జన్మించిన వారు అర్హులు.

  • పోస్ట్ పేరు: అగ్నివీర్ వాయు (ఇన్‌టేక్ 02/2026)


విద్యార్హతలు

ఈ రిక్రూట్‌మెంట్‌కు అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి 10+2 (ఇంటర్మీడియట్)లో గణితం, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మొత్తం 50% మార్కుల్లో ఇంగ్లీష్‌లో 50% మార్కులు సాధించాలి. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ లేదా ఐటీలో 3 సంవత్సరాల డిప్లొమా చేసి ఉండాలి.

వొకేషనల్ కోర్సు

  • ఫిజిక్స్, గణితం నాన్-వొకేషనల్ సబ్జెక్టులుగా ఉన్న 2 సంవత్సరాల వొకేషనల్ కోర్సు.

  • మొత్తం 50% మార్కులు, ఇంగ్లీష్‌లో 50% మార్కులు సాధించాలి.

  • అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలి.


దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అధికారిక వెబ్‌సైట్ ద్వారా జూలై 31, 2025 లోపు అప్లై చేసుకోవాలి.

ఎంపిక విధానం

  • అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ కోసం ఎంపిక ప్రక్రియలో కింది దశలు ఉన్నాయి

  • ముందుగా ఆన్‌లైన్ రాత పరీక్ష నిర్వహిస్తారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ పరీక్ష రాయాలి.

  • పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహిస్తారు

  • ఆ తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్ I: మానసిక సామర్థ్యం పరీక్ష

  • అడాప్టబిలిటీ టెస్ట్ II: సమూహ చర్చలు, ఇతర పరీక్షలు నిర్వహిస్తారు

  • మెడికల్ ఎగ్జామినేషన్: వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి

  • ఫైనల్ మెరిట్ లిస్ట్: అన్ని దశలలో పనితీరు ఆధారంగా తుది జాబితా తయారు చేయబడుతుంది

  • ఈ పోస్టులకు ఎంపికైన వారికి మొదటి ఏడాదిలో నెలకు రూ. 30,000, రెండో సంవత్సరం రూ.33,000, మూడో సంవత్సరం రూ.36,500, నాలుగో ఏడాది రూ.40 వేలు అందిస్తారు.


ఇవి కూడా చదవండి

స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం..జేన్ స్ట్రీట్‌పై సెబీ చర్యలు


రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 05 , 2025 | 05:27 PM