Share News

ఈపీఎస్‌ పెన్షన్‌ పెరిగేదెన్నడు

ABN , Publish Date - May 13 , 2025 | 05:08 AM

ఈపీఎస్‌ కనీస పింఛన్‌ను వెయ్యి రూపాయల నుంచి 7500కు పెంచమని గత ఎనిమిదేళ్ళుగా ఎంతోమంది కేంద్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసినా ఇంతవరకు పెంచలేదు....

ఈపీఎస్‌ పెన్షన్‌ పెరిగేదెన్నడు

ఈపీఎస్‌ కనీస పింఛన్‌ను వెయ్యి రూపాయల నుంచి 7500కు పెంచమని గత ఎనిమిదేళ్ళుగా ఎంతోమంది కేంద్ర ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేసినా ఇంతవరకు పెంచలేదు. పదేళ్ళ క్రితమే అనేక కమిటీలు కనీస ఫించన్‌ను మూడు వేలకు పెంచాలని సిఫారసులు చేసాయి. బీజేపీ నాయకుడు ప్రకాష్ జవదేకర్ 2013 ఎలక్షన్ మీటింగ్‌లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కనీస పెన్షన్‌ మూడు వేలు చేస్తామని వాగ్దానం చేశారు. ఆ తరువాత పట్టించుకోలేదు. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయ, తరువాత అనేక మంది పార్లమెంటు సభ్యులు ప్రతీ సభలోనూ ఈ విషయంపై మాట్లాడారు. మథుర ఎంపీ హేమమాలిని ప్రధాని మోదీని స్వయంగా కలిసి వివరించినా, చివరకు ప్రధానమంత్రి నాగపూర్ సభలో నాలుగేళ్ళ క్రితం వాగ్దానం చేసినా... అన్నీ నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. పెన్షన్‌దారుల్లో చాలా మంది ఇబ్బందులు పడుతూ బతుకులీడుస్తున్నారు. వీరంతా ఇంకా తమ కనీస పెన్షన్‌ 7500కు పెరుగుతుందని ఆశిస్తున్నారు. వికసిత భారత్ వీరి జీవితాలలో కూడా వికసించాలి కదా!

ఎన్.ఎస్.ఆర్.మూర్తి

ఇవి కూడా చదవండి..

AP SSC Supplimentary Exams hall tickets: టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

Encounter: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ

For National News And Telugu News

Updated Date - May 13 , 2025 | 05:08 AM