Share News

Insurance GST Exemption: బీమాతో దేశాభివృద్ధికి ధీమా

ABN , Publish Date - Sep 13 , 2025 | 01:15 AM

కోట్లాది మంది పట్టాదారుల బీమా ప్రీమియం సొమ్ముపై కేంద్రం 2017లో 18 శాతం జీఎస్టీ విధించింది. ఇది దేశీయ పొదుపు వ్యవస్థను దెబ్బతీయడమేనని, ఈ భారీ పన్ను వసూలును రద్దు చేయాలని కోరుతూ బీమా ఉద్యోగులు గతంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. దీనిపై...

Insurance GST Exemption: బీమాతో దేశాభివృద్ధికి ధీమా

కోట్లాది మంది పట్టాదారుల బీమా ప్రీమియం సొమ్ముపై కేంద్రం 2017లో 18 శాతం జీఎస్టీ విధించింది. ఇది దేశీయ పొదుపు వ్యవస్థను దెబ్బతీయడమేనని, ఈ భారీ పన్ను వసూలును రద్దు చేయాలని కోరుతూ బీమా ఉద్యోగులు గతంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. దీనిపై ‘ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్’ పెద్ద ఎత్తున ఉద్యమం సాగించింది. దేశవ్యాప్తంగా పలు సదస్సులు, సెమినార్లు, ప్రెస్‌మీట్స్ నిర్వహించింది. దాదాపు 45 లక్షలమంది పాలసీదారుల సంతకాలను సేకరించి వాటిని నాటి కేంద్ర ఆర్థికమంత్రికి పంపింది. అనంతరం కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషీ వంటి వారిని కలిసి బీమా ప్రీమియం సొమ్ముపై జీఎస్టీని రద్దు చేయాలని కోరింది. ఈ విషయంపై జోక్యం చేసుకోవాలని నీతి ఆయోగ్‌కు, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి లేఖలు రాసింది. యూనియన్‌ పోరాటం ఇన్నాళ్లకు ఫలించింది. జీఎస్టీ స్లాబ్ 18 శాతం నుంచి ప్రస్తుతం బీమా ప్రీమియంను కేంద్రం పూర్తిగా మినహాయించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మొత్తం బీమా రంగానికి ఎంతగానో ఉపకరిస్తుంది. ప్రభుత్వరంగంలోని బీమా సంస్థలను శక్తిమంతం చేసేలా ప్రభుత్వ విధానాలు ఉండాలి. ఈ సంస్థల ద్వారా ప్రజల నుంచి వసూలయ్యే కోట్లాది రూపాయల ప్రీమియం సొమ్ము దేశీయ పెట్టుబడిగా మారుతోంది. ఫలితంగా దేశ ప్రగతికి మార్గం సుగమం అవుతున్నది.

వి.వి.కే. సురేశ్‌

ఎల్ఐసీ ఎంప్లాయిస్ యూనియన్, మచిలీపట్నం

ఇవి కూడా చదవండి..

మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్

రేపటి నుంచి విజయ్‌ యాత్ర..

For More National News and Telugu News

Updated Date - Sep 13 , 2025 | 01:15 AM