Fee Reimbursement Promise to BC: ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:18 AM
తాము ఇస్తున్న వాగ్దానాలన్నింటినీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రేవంత్ సీఎంగా అధికారం చేపట్టి ఏడాదిన్నర గడచినా నేటికీ ఆయా హామీలను అమలు చేయలేదు. ముఖ్యంగా విద్యారంగంలో సమస్యలు...
తాము ఇస్తున్న వాగ్దానాలన్నింటినీ అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. రేవంత్ సీఎంగా అధికారం చేపట్టి ఏడాదిన్నర గడచినా నేటికీ ఆయా హామీలను అమలు చేయలేదు. ముఖ్యంగా విద్యారంగంలో సమస్యలు అలాగే ఉండిపోయాయి. కుటుంబ వార్షికాదాయం రూ. మూడు లక్షలలోపు ఉన్న విద్యార్థులకు వారి కోర్సులకనుగుణంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఆ హామీలను విస్మరించడంతో విద్యార్థులకు (ముఖ్యంగా బీసీలకు) వారి కళాశాలల నుంచి ఫీజుల వేధింపులు తప్పడం లేదు. విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే స్కాలర్‌షిప్‌లు కూడా పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా లేవు. తాము ఇప్పటికీ బీసీల పక్షానే ఉన్నామని కాంగ్రెస్ నమ్మబలుకుతోంది. కానీ దాని కార్యాచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం చిత్తశుద్ధితో హామీల అమలుకు కృషి చేయాలి. మెడికల్, ఇంజినీరింగ్, ఇతర కోర్సులు చదువుతున్న బీసీలకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి. ఆయా విద్యార్థుల నుంచి కళాశాలలు వసూలు చేసిన ఫీజులను తిరిగి వారికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.
పాపని నాగరాజు
ఇవి కూడా చదవండి..
మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
For More National News and Telugu News