Share News

Comrade Rangavalli: రంగవల్లి సంస్మరణ సభ

ABN , Publish Date - Nov 13 , 2025 | 05:37 AM

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) వ్యవస్థాపకుడు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 1975 నవంబర్‌ 5న (ఎమర్జెన్సీ కాలంలో) చీకటిగుండ్ల ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యారు. అనంతరం జంపాల ఆశయసాధనకు...

Comrade Rangavalli: రంగవల్లి సంస్మరణ సభ

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) వ్యవస్థాపకుడు కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 1975 నవంబర్‌ 5న (ఎమర్జెన్సీ కాలంలో) చీకటిగుండ్ల ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యారు. అనంతరం జంపాల ఆశయసాధనకు పీడీఎస్‌యూ జెండాను ఎత్తినది కామ్రేడ్ రంగవల్లి. యాదృచ్ఛికమే అయినా ఈ ఇద్దరూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాసులే.

కామ్రేడ్ రంగవల్లి ఉన్నతమైన కుటుంబంలో జన్మించించారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్రం అభ్యసించారు. ఆ సమయంలోనే పీడీఎస్‌యూ రాష్ట్ర కోశాధికారిగా ఎన్నికయ్యారు. ‘విజృంభణ’ మాసపత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. ఆమె కేవలం విద్యార్థి ఉద్యమాలకే పరిమితం కాలేదు. మహిళా సమస్యలపైనా కదంతొక్కారు. రైతుకూలీల సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. వరదల్లో నష్టపోయిన దివిసీమ ప్రజలకు అండగా నిలిచారు. ఇలా అనేక సామాజిక, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక సమస్యల మీద రాజకీయంగా స్పందించిన ధీశాలి ఆమె. ఈ క్రమంలోనే కామ్రేడ్ రంగవల్లి అడవిబాట పట్టారు. కుల, వర్గ పోరాటాన్ని సాగించారు. సీపీఐ (ఎం–ఎల్) జనశక్తి రాష్ట్ర నాయకురాలిగా శోషిత జనాలకు అండగా, ఆదివాసీ ప్రజలకు గొంతుకగా మారారు. పోరాట ధీర రంగవల్లిని రాజ్యం 1999 నవంబర్ 11న రాజకీయహత్య చేసింది. ఆమె అమరురాలై ఇటీవలే ఇరవై ఆరేళ్లు పూర్తయ్యాయి. కామ్రేడ్ రంగవల్లి ఇరవై ఆరవ వర్ధంతిని నేడు (13న) వేములవాడలోని (నంది కమాన్) ‘రంగవల్లి విజ్ఞాన కేంద్రం’లో నిర్వహించనున్నారు.

వంగల సంతోష్

ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక

ఇవి కూడా చదవండి..

26/11 నుంచి 10/11 పేలుళ్ల వరకూ మసూద్ అజార్ కీలక పాత్ర

జైష్ ఉగ్రమూకలకు మహిళా డాక్టర్ నాయకత్వం.. ఫరీదాబాద్ ఉగ్రకుట్ర కేసులో కీలక విషయాలు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 13 , 2025 | 05:37 AM