Share News

Ayodhya Balaram Temple: ధ్వజారోహణ ప్రత్యేకత.. జెండాపై ఏముందంటే..?

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:33 PM

అయోధ్యలోని బాలరాముడి ఆలయంపై కాషాయం జెండాను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఎగురవేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు అయోధ్యకు తరలి వచ్చారు. ఈ రోజుకు మరో విశిష్టత కూడా ఉంది.

Ayodhya Balaram Temple: ధ్వజారోహణ ప్రత్యేకత.. జెండాపై ఏముందంటే..?

అయోధ్యలోని బాలరాముడి ఆలయ శిఖరంపై ప్రధాని మోదీ మంగళవారం జెండాను ఎగురవేశారు. ఈ జెండాను పది అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో త్రిభూజాకారంలో రూపొందించారు. ఈ జెండాపై రాముడి తేజస్సుతోపాటు ఆయన శౌర్యాన్ని సూచికగా సూర్యుడుతోపాటు దేవకాంచనం చెట్టు (కోవిదార), ఓం చిహ్నాలను బంగారు దారంతో చేతితో ఎంబ్రాయిడరీ చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్యారాచూట్ తయారీ సంస్థ ఈ జెండాను తయారు చేసింది. సుదీర్ఘ కాలం మన్నేలా ఈ వస్త్రాన్ని రూపొందించింది.


  • హిందూ సంప్రదాయం ప్రకారం.. జెండాను ఎగురవేయడం అనేది అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా సూచిస్తుంది.

  • ఉత్తర భారతంలోని నిర్మాణ శైలి.. నాగర శైలిలో నిర్మించిన ఆలయ ప్రధాన శిఖరంపై ఈ జెండాను ఎగురవేశారు.

  • ఆలయ సముదాయం బయటి ఆవరణ (పార్కోటా) 800 మీటర్లు విస్తరించి.. దక్షిణ భారత సంప్రదాయంలో రూపొందించారు.


శుభప్రదమైన రోజు..

ధ్వజారోహణ జరిగిన ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. నేడు వివాహ పంచమి. ఈ రోజున సీతారాముల కల్యాణం జరిగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశిష్టమైన రోజున అదే అభిజిత్ లగ్న ముహూర్తంలో ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు.


మరో ప్రాముఖ్యత..

నవంబర్ 25వ తేదీ తొమ్మిదవ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ బలిదానం చేశారు. ఇక చారిత్రక ఆధారాల ప్రకారం.. 17వ శతాబ్దంలో ఇదే రోజు అయోధ్యలో 48 గంటల పాటు ధ్యానం చేశారు.


నాడు మొదలై.. నేటితో ముగిసింది..

2020, ఆగస్టులో ఈ దేవాలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 2024, జనవరి 22వ తేదీన ఈ ఆలయంలో బాలరాముడిని ప్రాణ ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.


నిర్మాణ పూర్తయిందనేందుక సూచికగా..

అయోధ్యలో రామమందిరం నిర్మాణం పూర్తయిందనేందుకు సాంకేతికంగా ఈ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఎవరెవరు పాల్గున్నారంటే..

ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తదితరులు హజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది శ్రీరామ భక్తులు అయోధ్యకు మంగళవారం తరలి వచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చరిత్రాత్మక ‘స్కంధ’ పుష్కరిణి..

సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

For More Devotional News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 03:10 PM