Share News

Angaraka Yoga: మారనున్న గ్రహస్థితులు.. ఈ రాశులు వారు జాగ్రత్త..

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:23 PM

మరికొద్ది రోజుల్లో సింహరాశిలో కుజుడు, కేతువు సంచారం వల్ల అంగారక యోగం ఏర్పడనుంది. దీని వల్ల పలు రాశుల వారు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆవి ఏ రాశులంటే..

Angaraka Yoga: మారనున్న గ్రహస్థితులు.. ఈ రాశులు వారు జాగ్రత్త..

జులై 1వ తేదీ నుంచి సింహరాశిలో కుజుడు, కేతువు సంచారం వల్ల అంగారక యోగం ఏర్పడనుంది. ఈ యోగం నెలాఖరు వరకు.. అంటే జులై 28వ తేదీ వరకు ఉంటుంది. ఈ యోగం కారణంగా మూడు రాశుల వారికి ఇబ్బందులు ఎదురవ్వనున్నాయి. ఆర్థిక నష్టంతోపాటు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. జులై 28వ తేదీ వరకు కుజుడు, కేతువు సింహరాశిలో కలిసి ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అటువంటి పరిస్థితుల్లో ఈ రాశుల వారికి సమస్యలు పెరిగే అవకాశముంది.


సింహ రాశి: అంగారక యోగం ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ సమయంలో.. వీరి స్వభావం కఠినంగా మారనుంది. కోపాన్ని నిగ్రహించుకోవాలి. కోపంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఈ సమయంలో.. జీవిత భాగస్వామితో ఘర్షణ జరిగే అవకాశముంది. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే.. ఈ నిర్ణయాన్ని కొన్ని రోజులు పాటు నిలిపివేయండి.


వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈ సమయం సానుకూలంగా ఉండకపోవచ్చు. ఈ యోగం.. మీ రాశి కర్మ స్వభావం కారణంగా ఏర్పడింది. కాబట్టి పని ప్రదేశంలో సహోద్యోగులతో ఏదైన విషయంపై వాదన జరగవచ్చు. సహనంతో పని చేయడం మంచిది, లేక పోతే వివాదం కారణంగా మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశముంది. ఈ సమయంలో ఉద్యోగం మారాలనుకుంటే ఆ నిర్ణయాన్ని కొంత కాలం పాటు వాయిదా వేయడం ఉత్తమం. వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ముఖ్యంగా ఈ రాశి గర్భిణీ స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంది.


మకరరాశి: వీరికి ఈ యోగం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ యోగం మీ జాతకంలో ఎనిమిదో ఇంట్లో ఉండటం... ఇది దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు సూచిస్తున్నాయి. ఈ కాలంలో ఆర్థిక సమస్యలు సైతం ఎదుర్కొనవచ్చు. రక్తపోటు సమస్య ఉన్న వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదో ఒక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో చాలా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశముంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆషాఢ మాసంలో వీటిని దానం చేస్తే.. శుభప్రదం..

అమ్మ వారు పూజలందుకునే మాసం.. ఆషాఢం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 27 , 2025 | 05:31 PM