Share News

Aashada Masam: ఆషాఢ మాసంలో వీటిని దానం చేస్తే.. శుభప్రదం..

ABN , Publish Date - Jun 26 , 2025 | 03:57 PM

ఆషాఢ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ఈ వస్తువులు దానం చేస్తే మంచిదని వేద పండితులు చెబుతుంటారు. అలాగే ఈ మాసంలో శ్రీమహా విష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని అంటారు.

Aashada Masam: ఆషాఢ మాసంలో వీటిని దానం చేస్తే.. శుభప్రదం..

ఆషాఢ మాసం గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో వారాహి అమ్మ వారి నవరాత్రులు ఉంటాయి. అలాగే వ్యాస పౌర్ణిమ, తొలి ఏకాదశ పర్వదినాలు సైతం ఈ మాసంలోనే వస్తాయి. అయితే ఈ మాసంలో తొలి రోజు శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని వేద పండితులు చెబుతారు. ఈ మాసంలో కొన్ని వస్తువులను దానం చేస్తే పుణ్యం, శాంతితోపాటు అదృష్టం లభిస్తుందని అంటారు. ఆహారం, నీటిని దానం చేయడం చాలా శుభ్రప్రదమని చెబుతారు. విష్ణువు, శ్రీమహాలక్ష్మీకి నీరు చాలా ప్రియమైనదని పేర్కొంటారు. వీటిని పేదలకు దానం చేయడం వల్ల దేవుని అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందంటారు.


చెప్పులు, బూట్లు..

ఈ మాసంలో పాదరక్షలు ( చెప్పులు, బూట్లు) దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ముఖ్యంగా పేదలకు ఈ వస్తువులు ఇవ్వడం వల్ల వారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.


గొడుగు దానం..

గొడుగు దానం చేయడం వల్ల అదృష్టాన్ని తెచ్చిపెడుతుందంటారు.


దిండ్లు, బెడ్ షీట్లు..

దిండ్లు, బెడ్ షీట్లు.. దానం చేయడం శుభప్రదం. శ్రీమహా విష్ణువు నిద్రలో ఉన్న సమయంలో వీటిని అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదం.


తెల్లటి వస్తువులు దానం చేస్తే..

వీటితోపాటు పాలు, పెరుగు, తెల్లని వస్త్రాలు, నీటి పాత్రలు వంటి తెల్లని రంగు వస్తువులు దానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులు దానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శుద్ధి, దేవుని అనుగ్రహంతోపాటు అదృష్టం లభిస్తాయని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 26 , 2025 | 05:39 PM