2025 Amavasya: 2025లో చివరి అమావాస్య.. ఈ 5 రాశుల వారి జీవితంలో అద్భుతం జరుగబోతోంది..!
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:26 PM
రోజులు, వారాలు, నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. మరికొద్ది రోజుల్లో 2025 సంవత్సరం ముగియనుంది. 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, సంవత్సరాంతానికి చేరుకుంటున్న క్రమంలో ఆకాశంలో ప్రత్యేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని..
రోజులు, వారాలు, నెలలు చూస్తుండగానే గడిచిపోయాయి. మరికొద్ది రోజుల్లో 2025 సంవత్సరం ముగియనుంది. 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అయితే, సంవత్సరాంతానికి చేరుకుంటున్న క్రమంలో ఆకాశంలో ప్రత్యేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. డిసెంబర్ 19, 2025 న వచ్చే అమావాస్య ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కానుంది. జ్యోతిష్య శాస్త్రం దృష్టిలో ఈ అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందట. ఈ అమావాస్య తరువాత కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారి జీవితంలో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుందని.. అమావాస్య ప్రభావంతో ఆయా రాశుల ప్రజల జీవితంలో సానుకూల ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. మరి ఈ అమావాస్య తరువాత ఏ రాశుల వారి జీవితంలో మార్పు ఉండనుంది.. జ్యోతిష్య నిపుణులు చెబుతున్నట్లుగా ఆ రాశుల వ్యక్తులపై ఎలాంటి ప్రభావం ఉండబోతోందో ఈ కథనంలో తెలుసుకుందాం..
వృషభ రాశి:
వృషభ రాశి వారికి ఈ సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఊహించని బహుమతులు అందుకునే అవకాశం ఉంది. ఆశ్చర్యకరమైన సంఘటనలను చూస్తారు. జీవితంలో దేని కోసం ఎదురు చూడాల్సిన పని లేకుండా.. అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి. ఆనందం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థికంగా కూడా సంతృప్తికరమైన సమయం. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.
సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ అమావాస్య పాత చేదు జ్ఞాపకాలను, ఎదురుదెబ్బలను తుడిచిపెట్టేస్తుంది. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయనే నమ్మకం తిరిగి వస్తుంది. చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. జీవితం ఆనందమయం అవుతుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, పరీక్షా కాలం ఇంతటితో ముగుస్తుంది. అమావాస్య తర్వాత మీ మానసిక పరిస్థితిలో పెద్ద మార్పు ఉంటుంది. గతంలో అసాధ్యం అని భావించిన పనులు సైతం.. ఇప్పుడు సులువుగా చేసేస్తారు. సమస్యలన్నీ సమసిపోతాయి. మనస్సు తేలికగా మారుతుంది. సానుకూల మార్గంలో ముందుకు సాగుతారు.
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ అమావాస్య సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రేరేపిస్తుంది. ముందే రూపొందించుకున్న ప్రణాళికలలో ఆకస్మిక మార్పులు వచ్చినప్పటికీ, అవి చివరికి శుభ ఫలితాలను ఇస్తాయి. కొత్త వార్తలు మీ మానసిక స్థితిని సానుకూలంగా మారుస్తాయి.
మీన రాశి:
మీన రాశి వారికి ఇది నిజంగా అద్భుతాల సమయం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు అకస్మాత్తుగా ఊపందుకుంటాయి. జీవిత మార్గంలో అడ్డంకులు వాటంతట అవే తొలగిపోతాయి. ప్రియమైన వ్యక్తితో ఒక చిన్న సంభాషణ చాలా కాలం పాటు జ్ఞాపకంగా నిలిచి ఉండే ఆనందాన్ని ఇస్తుంది.
దానం చేయాలి..
ఈ అమావాస్య సమయంలో పితృదేవతలకు స్మరించుకోవాలి. వారి పేరిట దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వలన జాతకంలో ప్రతికూలతను తొలగిపోతాయి. ముఖ్యంగా, ఈ 5 రాశులవారు సంవత్సరం చివరిలో దీపాలు పెట్టి పూజించడం వలన మానసిక ప్రశాంతతను పొందుతారు. గ్రహ స్థానాల్లో మార్పు కొత్త సంవత్సరానికి సూచన, ఈ సమయం కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి అనుకూలంగా ఉంటుంది. మతపరమైన ఆచారాలతో పాటు సానుకూల ఆలోచనను పెంపొందించుకుంటే.. అమావాస్య తర్వాత వచ్చే కాలం అంతా సంపన్నంగా ఉంటుంది. 2025 లో వచ్చే ఈ చివరి అమావాస్య, మీరు ఏడాది పొడవునా ఎదుర్కొన్న కష్టాలను మరచిపోయి, కొత్త సంవత్సరానికి సిద్ధం కావడానికి గట్టి పునాది వేయడానికి సహాయపడుతుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం జ్యోతిషశాస్త్ర గ్రంధాలు, జ్యోతిష్య నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఆంధ్రజ్యోతి పై సమాచారాన్ని ధృవీకరించడం లేదు.)
Read More:
Boyfriend: నాన్నా.. నాకో బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.. కూతురి మాటలకు తండ్రి రియాక్షన్ ఏంటంటే..
IND VS SA: స్టార్ బౌలర్ ఎంట్రీ.. నాలుగో టీ20 భారత తుది జట్టు ఇదే!