Bengaluru News: వినాయకా.. ఎంతపని చేశావయ్యా.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:25 AM
నగరంలో ఉత్సహంగా సాగుతున్న గణేశ్ ఉత్సవాల్లో సోమవారం తెల్లవారు జామున అపశ్రుతి చోటు చేసుకుంది. నగరంలోని గణేశ్ మండపం నుంచి నిమజ్జనానికి తరలిస్తున్న వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
- నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ యువకుడి మృతి
రాయచూరు(బెంగళూరు): నగరంలో ఉత్సహంగా సాగుతున్న గణేశ్ ఉత్సవాల్లో సోమవారం తెల్లవారు జామున అపశ్రుతి చోటు చేసుకుంది. నగరంలోని గణేశ్ మండపం నుంచి నిమజ్జనానికి తరలిస్తున్న వినాయకుడి విగ్రహం ముందు డ్యాన్స్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తీన్ ఖందిల్ మీదుగా ఖాసభావి వద్దకు నిమజ్జనానికి తరలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

కుప్పకూలిపోయిన యువకుడిని ఆస్పత్రికి చికిత్స కోసం వీజీ కులకర్ణి కార్డియాలజీ ఆస్పత్రి(VG Kulkarni Cardiology Hospital)కి తరలించగా అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి చేర్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అప్పటికే యువకుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. మృతి చెందిన యువకుడు స్థానిక మంగళవారపెటకు చెందిన అభిషేక్ (24)గా గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News