నాటు తుపాకీతో కోడిని కాల్చేందుకు యత్నం.. తూటా తగిలి యువకుడి మృతి
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:35 PM
నాటు తుపాకీతో కోడిని కాల్చుతున్న సమయంలో, గుండు గురితప్పి యువకుడికి తగలగా అతను ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కళ్లకుర్చి జిల్లా కల్వరాయన్ కొండ ప్రాంతాలోని మేల్‌మదూర్ గ్రామానికి చెందిన అన్నామలై, తన అల్లుడికి కోడి కూర చేయాలని, దానికోసం తాను సంరక్షిస్తున్న కోళ్లను పట్టుకునేందుకు యత్నించగా, అవి చిక్కలేదు..
చెన్నై: నాటు తుపాకీతో కోడిని కాల్చుతున్న సమయంలో, గుండు గురితప్పి యువకుడికి తగలగా అతను ఘటనా స్థలంలోనే మృతిచెందారు. కళ్లకుర్చి జిల్లా కల్వరాయన్ కొండ ప్రాంతాలోని మేల్‌మదూర్ గ్రామానికి చెందిన అన్నామలై(Annamalai), తన అల్లుడికి కోడి కూర చేయాలని, దానికోసం తాను సంరక్షిస్తున్న కోళ్లను పట్టుకునేందుకు యత్నించగా, అవి చిక్కలేదు.. దీంతో, నాటు తుపాకితో కోడిని కాల్చేందుకు యత్నించాడు.

తుపాకీ గుండు కోడికి తగులకుండా పక్క ఇంటి వరండాలో నిద్రపోతున్న ప్రకాష్(Prakash) అనే యువకుడి తలలో చొచ్చుకుపోయింది. దీంతో అతడు ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ప్రకాష్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి అన్నామలైను అరెస్ట్ చేసి, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News