Share News

Hyderabad: కార్మికుడి నుంచి డ్రగ్‌ ప్లెడ్లర్‌గా మారి....

ABN , Publish Date - Jul 19 , 2025 | 10:28 AM

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కార్మికుడు నగరానికి డ్రగ్స్‌ తెచ్చి విక్రయించే యత్నం చేస్తూ పోలీసులకు చిక్కాడు. వెస్ట్‌బెంగాల్‌ మాల్దా జిల్లా సుబేదార్‌టోలా గ్రామానికి చెందిన రాజ్‌కుల్‌ హౌకే (21) కొంతకాలం క్రితం నగరానికి వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు.

Hyderabad: కార్మికుడి నుంచి డ్రగ్‌ ప్లెడ్లర్‌గా మారి....

- ఆర్థిక ఇబ్బందులతో అక్రమ మార్గంలోకి..

- అరెస్ట్‌ చేసిన పోలీసులు

- రూ.7.60లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు వెస్ట్‌బెంగాల్‌కు చెందిన కార్మికుడు నగరానికి డ్రగ్స్‌ తెచ్చి విక్రయించే యత్నం చేస్తూ పోలీసులకు చిక్కాడు. వెస్ట్‌బెంగాల్‌(West Bengal) మాల్దా జిల్లా సుబేదార్‌టోలా గ్రామానికి చెందిన రాజ్‌కుల్‌ హౌకే (21) కొంతకాలం క్రితం నగరానికి వచ్చి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశాడు. తర్వాత స్వస్థలానికి వెళ్లి పనులు చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు.


ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని చూస్తున్న తరుణంలో మల్దా జిల్లాకు చెందిన మోజీబర్‌ మిస్త్రీ అనే డ్రగ్స్‌ విక్రేతతో పరిచయం అయింది. హైదరాబాద్‌(Hyderabad)లో డ్రగ్స్‌కు భారీ డిమాండ్‌ ఉందని, ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసి, నగరంలో విక్రయించి భారీగా అర్జించవచ్చని ఆశపెట్డాడు. అతడి మాటలు నమ్మిన రాజ్‌కుల్‌ అతడి వద్ద నుంచి యాంఫేటమిన్‌ డ్రగ్‌ కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చాడు.


city7.jfif

చిలకలగూడ లైన్‌బజార్‌ మసీద్‌ వద్ద కస్టమర్ల కోసం ఎదురు చూస్తుండగా, పక్కా సమాచారం అందుకున్న ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, చిలకలగూడ పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రూ.7.60 లక్షల విలువైన యాంఫేటమిన్‌తో పాటు మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

గోదావరిపై మీ కార్యాచరణ ఏంటి?

Read Latest Telangana News and National News

Updated Date - Jul 19 , 2025 | 10:28 AM