Hyderabad: వీకెండ్‌లో విలాసాలు.. పబ్బుల్లో జల్సాలు.. ఇదీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ చరిత్ర
ABN , Publish Date - Feb 04 , 2025 | 11:22 AM
చ్చిబౌలి ప్రిజం పబ్(Gachibowli Prism Pub) వద్ద పోలీసులపై జరిపిన కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తిని ప్రభాకర్(Most wanted criminal Bathini Prabhakar)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
- గచ్చిబౌలి కాల్పుల కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- బయటపడుతున్న ఘరానా క్రిమినల్ బత్తిని ప్రభాకర్ నేర చరిత్ర
హైదరాబాద్ సిటీ: గచ్చిబౌలి ప్రిజం పబ్(Gachibowli Prism Pub) వద్ద పోలీసులపై జరిపిన కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తిని ప్రభాకర్(Most wanted criminal Bathini Prabhakar)ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ప్రభాకర్‌కు సహకరించిన మరో ఇద్దరు రాహుల్, రంజిత్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారిని విచారించిన క్రమంలో అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. శనివారం సాయంత్రం పబ్బు వద్ద పోలీసులపై కాల్పులు జరిపిన ప్రభాకర్ అంతకు ముందే ఒక కారులో తన ఇద్దరి స్నేహితులతో వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి సీసీ టీవీ ఫుటేజ్(CCTV footage)లో ఆ దృశ్యాలు గుర్తించిన పోలీసులు కారు నంబరు ఆధారంగా ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. ఏమైందో తెలిస్తే..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఫ్లాట్ అద్దెకు...
వీకెండ్‌లో పబ్బులకు వెళ్లి విపరీతంగా డబ్బు ఖర్చుచేస్తూ అమ్మాయిలతో జల్సాలు చేసే అలవాటు ఉన్న ప్రభాకర్ పబ్బులో ఇతర యువకులకు విపరీతంగా మద్యం తాగించేవాడు. వేలల్లో టిప్పులు ఇచ్చేవాడు. సైబరాబాద్(Cyberabad) పరిధిలోని చాలా పబ్బుల్లో ఆయన రాకకోసం, ఆయనిచ్చే టిప్పుల కోసం కొంతమంది యువకులు, అమ్మాయిలు ఎదురుచూసేవారని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. అలా పరిచమైన సాఫ్ట్‌వేర్లను అడ్డం పెట్టుకొని తాను ఓ సాఫ్ట్‌వేర్‌నంటూ గచ్చిబౌలి(Gachibowli)లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటునట్టు తేలింది.

తన అవసరాన్ని బట్టి పరిచయస్తులను, స్నేహితులను వినియోగించుకునేవాడు. అతడి ఫోన్ కాల్ లిస్ట్ ఆధారంగా ఎంతమందితో తనకు పరిచయాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు? ఏ ఏ పబ్బులకు వెళ్లేవాడు, ఎక్కడ జల్సాలకు పాల్పడే వాడు, అతడికి ఎవరు సహాకారం అందించేవారనే కొణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరికొంత మందిని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. అతడి నేర చర్రిత, జల్సాలు, విలాసవంతమైన జీవితాన్ని చూసి పోలీసులు షాక్ తిన్నట్టు సమాచారం.
ఈవార్తను కూడా చదవండి: KP Chowdary : నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్య
ఈవార్తను కూడా చదవండి: MLA Raj Gopal Reddy : మంత్రిని అడ్డుకున్నారన్న కేసు కొట్టివేయండి
ఈవార్తను కూడా చదవండి: Leopard: గ్రామ సింహం దెబ్బకు పరుగులు పెట్టిన చిరుత..
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు: ఎంపీ ధర్మపురి ఆగ్రహం..
Read Latest Telangana News and National News