Share News

UP Woman Thrashes Husband: భర్తను చితకబాదిన భార్య.. సమోసాలు తెమ్మంటే తేలేదని..

ABN , Publish Date - Sep 05 , 2025 | 07:31 PM

యూపీలోని పిలిభిత్ జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భర్త సమోసాలు తేకపోవడంతో రెచ్చిపోయిన ఓ యువతి తన కుటుంబసభ్యులతో కలిసి అతడిని చావబాదింది. ఈ ఉదంతం స్థానికంగా కలకలానికి దారి తీసింది.

UP Woman Thrashes Husband: భర్తను చితకబాదిన భార్య.. సమోసాలు తెమ్మంటే తేలేదని..
UP samosa Dispute

ఇంటర్నెట్ డెస్క్: యూపీలోని పిలిభిత్ జిల్లాలో తాజాగా దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే వివాహం చేసుకున్న ఓ యువతి తన కుటుంబసభ్యులతో కలిసి భర్తను చావబాదింది. తను సమోసా తెమ్మంటే తేలేదన్న కోపంతో ముందు వెనుకా చూడకండా భర్తతో పాటు అతడి కుటుంబసభ్యులపైనా దాడి చేసింది. స్థానికంగా ఈ ఉదంతం కలకలానికి దారి తీసింది (UP Samosa Dispute ).

ఆగస్టు 29న సంగీత అనే మహిళ తన భర్త శివమ్‌ను సమోసా తెమ్మని బయటకు పంపించింది. అయితే, బయటకు వెళ్లాక డబ్బు పోగొట్టుకున్న శివమ్ ఉత్త చేతులతో తిరిగొచ్చాడు. దీంతో, అతడిపై సంగీతకు చిర్రెత్తుకొచ్చింది. యువ జంట మధ్య పెద్ద వాగ్వాదం చెలరేగింది. ఆ కోపంలో సంగీత రాత్రికి భోజనం మానేసింది. అక్కడితో ఆగక తన పుట్టింటి వారిని పిలిపించి మళ్లీ గొడవకు తెరలేపింది (Pilibhit family assault case).


సంగీత, ఆమె సోదరుడు తనను, తన తల్లిని కూడా కొట్టారని శివమ్ వాపోయాడు. ఆ తరువాత గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీలో కూడా సంగీత, ఆమె పుట్టింటి వారు రెచ్చిపోయారని అన్నాడు. బెల్టులతో తమపై దాడికి దిగారని ఆరోపించాడు (man thrashed by wife’s relatives).

‘సమోసాలు తీసుకురమ్మని నా భార్య చెప్పింది. కానీ అది కుదరలేదు. ఆ తరువాత పంచాయతీ జరిగింది. అక్కడ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే బదులు వారు నన్ను, నా కుటుంబాన్ని చావబాదారు. మేము పోలీసులకు ఫిర్యాదు చేశాము’ అని శివమ్ అన్నాడు (samosa fight police complaint).

శివమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘర్షణలో ఓ యువకుడికి గాయాలయ్యాయని, అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. ఈ ఉదంతం స్థానికంగా చర్చనీయాంశం అవుతోంది. అనేక మంది యువతి చర్యలను తప్పుబట్టారు.


ఇవి కూడా చదవండి:

చెల్లెల్ని హత్య చేసిన అన్న.. తప్పించుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేసి..

వార్నీ.. చివరకు నకిలీ టికెట్లు కూడానా.. విషయం ఏంటంటే..

Read Latest and Crime News

Updated Date - Sep 05 , 2025 | 07:31 PM