Share News

Selfie: ప్రాణ సంకటంగా మారిన సెల్ఫీమోజు..

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:59 AM

నీలగిరి జిల్లా ముదుమలై వద్ద ఓ అడవి ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన పర్యాటకుడిపై ఆ ఏనుగు దాడి చేయటంతో గాయపడ్డాడు. ముదుమలై బందిపూర్‌ పులుల అభయారణ్యం ఉన్న జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం ఓ ఏనుగు సంచరించింది.

Selfie: ప్రాణ సంకటంగా మారిన సెల్ఫీమోజు..

- ఏనుగు దాడిలో పర్యాటకుడికి గాయాలు

చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లా ముదుమలై వద్ద ఓ అడవి ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన పర్యాటకుడిపై ఆ ఏనుగు దాడి చేయటంతో గాయపడ్డాడు. ముదుమలై బందిపూర్‌ పులుల అభయారణ్యం ఉన్న జాతీయ రహదారిలో ఆదివారం సాయంత్రం ఓ ఏనుగు సంచరించింది. ఆ ఏనుగును గమనించిన వాహనచోధకులు తమ వాహనాలను అక్కడికక్కవే ఆపివేశారు. ఆ ఏనుగు క్యారెట్‌ లోడుతో ఉన్న లారీ దగ్గరకు వెళ్లి క్యారెట ఆరగించి రహదారి పక్కగా నిలిచింది.


nani5.2.jpg

ఆ సమయంలో అటువైపు వచ్చిన ఓ పర్యాటకుడు ఆ ఏనుగుతో సెల్ఫీ తీసుకునేందుకు దాని దగ్గరకు వెళ్ళాడు. గమనించిన ఆ ఏనుగు ఘీంకరిస్తూ అతడిని తరిమింది. దీనితో భీతిల్లిన అతడు పరుగు లంఘించుకుని కిందపడ్డాడు. ఏనుగు కాలితో అతడిపై దాడి చేసి అడవిలోకి వెళ్లింది. ఆ తర్వాత వాహనచోధకులు అతడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ పర్యాటకుడిని అడవి ఏనుగు తరుముతున్న దృశ్యాల వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధరలు.. కానీ వెండి మాత్రం..

చట్టాలు తెలుసుకుని అమెరికా రండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 12 , 2025 | 11:59 AM