Share News

Tirupati: ప్రేమించకుంటే కుటుంబాన్ని చంపేస్తా..

ABN , Publish Date - Oct 25 , 2025 | 11:52 AM

‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను ప్రేమించకుంటే మీ కుటుంబాన్ని చంపేస్తా’ అని బాలికను వేధించిన యువకుడిని తిరుపతి రూరల్‌ పోలీసులు అరెస్టు చేశారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వివరాల మేరకు... చిత్తూరు జిల్లా చెన్నంపల్లి గ్రామానికి చెందిన కోలా దిలీప్ కుమార్‌ తిరుపతిలోని ఒక అపార్టుమెంటులో కాపురముంటున్నాడు.

Tirupati: ప్రేమించకుంటే కుటుంబాన్ని చంపేస్తా..

- బాలికను వేధించిన కేసులో నిందితుడి అరెస్టు

తిరుపతి: ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను... నువ్వు నన్ను ప్రేమించకుంటే మీ కుటుంబాన్ని చంపేస్తా’ అని బాలికను వేధించిన యువకుడిని తిరుపతి రూరల్‌ పోలీసులు(Tirupati Rural Police) అరెస్టు చేశారు. అదనపు ఎస్పీ రవిమనోహరాచారి వివరాల మేరకు... చిత్తూరు జిల్లా చెన్నంపల్లి గ్రామానికి చెందిన కోలా దిలీప్ కుమార్‌(Kola Dilip Kumar) తిరుపతిలోని ఒక అపార్టుమెంటులో కాపురముంటున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బాలికను ఆరు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.


nani2.2.jpg

వెంటపడి బెదిరిస్తున్నాడు. గురువారం రాత్రి బాలిక ఇంటి వద్దకు వెళ్లి ఆమె చేయి పట్టుకుని ప్రేమించకపోతే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. బాలిక కేకలు వేయడంతో తల్లి, అన్న వచ్చి అడ్డుకున్నారు. వారినీ బెదిరించాడు. చుట్టుపక్కల వారు అక్కడకు రావడంతో పారిపోయాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసిన తిరుపతి రూరల్‌ పోలీసులు శుక్రవారం కోలా దిలీప్ కుమార్‌ను ఆర్సీ పురం జంక్షన్‌ వద్ద అరెస్టు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..

కన్నీటి మంట ఊరట చెమ్మ!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2025 | 11:52 AM