Share News

Tirupati News: ర్యాపిడో పేరుచెప్పి.. బైకుపై తీసుకెళ్లి...

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:54 PM

ర్యాపిడో.. అంటూ బైకులో ఎక్కించుకున్నాడు. దూరంగా పొదల్లోకి తీసుకెళ్లి మరికొందరు మందబాబులతో కలిసి ఆ భక్తుడిపై దాడిచేసి బంగారు గొలుసు లాక్కెళ్లారు. తిరుపతిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి అలిపిరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Tirupati News: ర్యాపిడో పేరుచెప్పి.. బైకుపై తీసుకెళ్లి...

- భక్తుడిపై మందుబాబుల దాడి

- మెడలో ఉన్న గొలుసు చోరీ

తిరుపతి: ర్యాపిడో.. అంటూ బైకులో ఎక్కించుకున్నాడు. దూరంగా పొదల్లోకి తీసుకెళ్లి మరికొందరు మందబాబులతో కలిసి ఆ భక్తుడిపై దాడిచేసి బంగారు గొలుసు లాక్కెళ్లారు. తిరుపతి(Tirupati)లో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి అలిపిరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. శ్రీకాకుళంకు చెందిన శ్రీధర్‌, నెల్లూరు వైఎస్ఆర్‌ కాలనీలో ఉంటున్న ఓ కుటుంబం తిరుమల శ్రీవారి దర్శనం కోసం రెండు రోజుల క్రితం తిరుమలకు వచ్చారు.


అక్కడ దర్శనం చేసుకుని ఉపాధ్యాయనగర్‌లో రూము అద్దెకు తీసుకున్నారు. ఆ తర్వాత నెల్లూరుకు చెందిన భక్తులు వెళ్లిపోయారు. శ్రీధర్‌ మాత్రం రైల్వే స్టేషన్‌కు వెళ్ళడానికి ఉపాధ్యాయ నగర్‌లోని బస్టాపు వద్ద నిలబడి ఉన్నారు. ఇతడిని గమనించిన ఓ వ్యక్తి రాపిడో పేరుతో మాయమాటలు చెప్పి ద్విచక్ర వాహనంలో ఎక్కించుకున్నాడు. కొంతదూరంలోని ముళ్లపొదల వద్దకు తీసుకెళ్లాడు.


zzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz.jpg

అక్కడ మద్యం తాగుతున్న తన స్నేహితులతో కలిసి శ్రీధర్‌(Sridhar)పై దాడి చేశారు. అతడి మెడలో వున్న దాదాపు నాలుగు సవర్ల బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితుడి కేకలతో స్థానికులు వచ్చారు. వీరిచ్చిన సమాచారంతో అలిపిరి ఎస్‌ఐ లోకేష్‌, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఐదుగురు పరారయ్యారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మూగబోయిన మావోయిస్టుల కంచుకోట!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 20 , 2025 | 01:54 PM