Share News

Chennai News: ఛీ.. దుర్మార్గుడా.. గురువులే ఇలా ఉంటే..

ABN , Publish Date - Sep 20 , 2025 | 01:52 PM

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌ కటకటాలపాలయ్యాడు. తిరుచ్చి కేకే నగర్‌కు చెందిన తమిళ్‌ (52) తిరుచ్చిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు.

Chennai News: ఛీ.. దుర్మార్గుడా.. గురువులే ఇలా ఉంటే..

- విద్యార్థినిపై లైంగిక వేధింపులు: ప్రొఫెసర్‌ అరెస్ట్‌

చెన్నై: విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రొఫెసర్‌ కటకటాలపాలయ్యాడు. తిరుచ్చి కేకే నగర్‌(Tiruchi KK Nagar)కు చెందిన తమిళ్‌ (52) తిరుచ్చిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 13న తమిళ్‌ తన గదిలో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. దీనిపై బాధితురాలు తరగతి టీచర్‌, అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు.


nani5.jpg

దీంతో తల్లిదండ్రులకు తెలుపడంతో వారు మనికండం పోలీసుస్టేషన్‌(Manikandam Police Station)లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఈ కేసును తిరువెరుంబూర్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదుచేసిన పోలీసులు, తమిళ్‌ను అరెస్ట్‌ చేసి తిరుచ్చి మహిళా కోర్టులో హాజరుపరచి తిరుచ్చి జైలుకు తరలించారు. కాగా, విద్యార్థిని ఫిర్యాదుచేసినా పట్టించుకోని అసిస్టెంట్‌ ప్రిన్సిపాల్‌, తరగతి టీచర్‌పై చర్యలు చేపట్టాలనే ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా

Read Latest Telangana News and National News

Updated Date - Sep 20 , 2025 | 01:52 PM