Thane Man Attacked: గ్యాంగ్ వార్.. ఓ వ్యక్తిని 8 మంది చుట్టుముట్టి..
ABN , Publish Date - Nov 18 , 2025 | 02:57 PM
మహారాష్ట్రలోని థానేలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పాత కక్షల నేపథ్యంలో ఓ గ్యాంగ్‌కు చెందిన 8 మంది ఓ వ్యక్తిపై కత్తులతో భీకర దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని ఏకంగా 8 మంది చుట్టుముట్టి విచక్షణా రహితంగా దాడి చేశారు. థానే జిల్లాలో ఈ భయానక ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్ర గాయాలపాలయ్యారు (Thane Man attacked by a Gang of 8) .
జిల్లాలోని అంబర్‌నాథ్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. నిందితుడిని సుధీర్ ఓమ్‌ప్రకాశ్ సింగ్‌గా గుర్తించారు. అతడు తన కారును మరమ్మతు చేయించుకుంటుండగా ఓ గ్యాంగ్‌కు చెందిన 8 మంది ఒక్కసారిగా అతడిని చుట్టుముట్టారు. బాధితుడు తేరుకునే లోపే ఐదుగురు అతడిపై దాడికి దిగారు. పదునైన వస్తువులతో దాడి చేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు సింగ్ విశ్వప్రయత్నం చేశాడు. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో అతడు కాలు జారి కింద పడటంతో నిందితులు సింగ్‌ను మళ్లీ ఇష్టారీతిన కొట్టారు. ఒకరి తరువాత మరొకరు అతడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం, అక్కడి నుంచి బైకులపై పారిపోయారు. బాధితుడి స్కూటీని కూడా ధ్వంసం చేసి వెళ్లారు.
ఈ దాడిలో సుధీర్ సింగ్ తీవ్రగాయాల పాలయ్యాడు. అతడి వీపు, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ప్రస్తుతం సుధీర్ సింగ్ ఉల్హాస్‌నగర్‌లోని సెంట్రల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అంబర్‌నాథ్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సింగ్‌పై దాడి చేసిన వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ చదవండి
క్లాసుకు లేటుగా వచ్చినందుకు 100 గుంజిళ్ల శిక్ష.. బాలిక మృతి
వధువును రాడ్డుతో కొట్టి చంపిన వరుడు.. పెళ్లికి గంట ముందు దారుణం
మరిన్ని క్రైమ్, జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి