Share News

దారుణం.. రూ.200 కోసం హత్య

ABN , Publish Date - Aug 16 , 2025 | 12:04 PM

ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగారశిక్షను అనుభవించి జైలు నుంచి విడుదలైన వ్యక్తి కేవలం 200 రూపాయల కూలి డబ్బులకోసం తోటి కూలీని దారుణంగా హతమార్చిన సంఘటన ఉత్తరకన్నడ జిల్లా శిరసి తాలూకాలో చోటు చేసుకుంది. కమటగేరిలో గురువారం రాత్రి 8.30 గంటలకు కమటగేరి వాజిరాజమఠం సమీపంలో రవీశ్‌ గణపతి చన్నయ్య, మంజునాథ బసయ్య చన్నయ్యల మధ్య గొడవ జరిగింది.

దారుణం.. రూ.200 కోసం హత్య

బెంగళూరు: ఓ హత్య కేసులో యావజ్జీవ కారాగారశిక్షను అనుభవించి జైలు నుంచి విడుదలైన వ్యక్తి కేవలం 200 రూపాయల కూలి డబ్బులకోసం తోటి కూలీని దారుణంగా హతమార్చిన సంఘటన ఉత్తరకన్నడ జిల్లా శిరసి తాలూకాలో చోటు చేసుకుంది. కమటగేరిలో గురువారం రాత్రి 8.30 గంటలకు కమటగేరి వాజిరాజమఠం సమీపంలో రవీశ్‌ గణపతి చన్నయ్య, మంజునాథ బసయ్య చన్నయ్యల మధ్య గొడవ జరిగింది. రవీశ్‌ 500 రూపాయలు మంజు నాథకు ఇవ్వాల్సి ఉండేది.


అందులో రూ.300 ఇచ్చాడు. రూ.200 కోసం ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసు కుంది. మద్యం మత్తులో రవీశ్‌ (35)పై గడ్డపారతో తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు మంజునాథను శుక్రవారం ఉదయం శిరసి గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. మంజునాథ 2002 లో భార్య తండ్రి (మామ)ను హత్య చేసిన మేరకు యావజ్జీవ కారాగారశిక్షకు గురయ్యాడు.


pandu2.2.jpg

2016 నాటికి శిక్ష ముగియడంతో జైలునుంచి బయటకు వచ్చి రవీశ్‌ తో కలసి కూలి పనులు చేసేవాడు. మద్యం మత్తులో తరచూ గొడవ చేసేవాడని రవీశ్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. శిరసి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. జిల్లా అడిషినల్‌ ఎస్పీ కృష్ణమూర్తి, డీఎస్పీ గీతాపాటిల్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

త్వరలో ఖనిజ రంగంలోకి సింగరేణి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 12:26 PM