Hyderabad: బెయిల్‌పై వచ్చిన నెలకే మళ్లీ చోరీలు..
ABN , Publish Date - Jul 11 , 2025 | 07:28 AM
సైబరాబాద్, రాచకొండ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను సౌత్‌వెస్టు జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ సిటీ: సైబరాబాద్, రాచకొండ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను సౌత్‌వెస్టు జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ.31 లక్షల విలువైన 31.45 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా బోధన్ వడ్డేపల్లికి చెందిన జగన్నాథం ప్రభు గతంలో రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి పరిధిలో ఉంటూ మేస్త్రీ పనులు చేసుకునేవాడు.

చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాల బాట పట్టాడు. తాళం వేసిన ఇళ్లలో దొంగతనాలు చేసేవాడు. మే నెలలో నార్సింగి పోలీసులకు చిక్కి అరెస్టయ్యాడు. బెయిల్‌పై బయటకు వచ్చిన నెలకే ఉప్పల్, మేడిపల్లి, ఎల్‌బీనగర్ పరిధిలో పలు చోరీలకు పాల్పడి నగదు, బంగారం దోచుకెళ్లాడు. అతడిపై నిఘా పెట్టిన పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
మరో కేసులో ఇద్దరు..
నకిలీ నోట్లు అంటగట్టి అసలు నోట్లు దోచుకుంటున్న మరో ఇద్దరు ఘరానా దొంగలను సౌత్‌వెస్టు జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన సయ్యద్ వసీముద్దిన్‌కు హైదరాబాద్ వట్టేపల్లికి చెందిన ఆటోడ్రైవర్ మహ్మద్ ఆజం ఆలీ అలియాస్ ఇమ్రాన్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి చెడు అలవాట్లకు బానిసలై చోరీలు చేయడం ప్రారంభించారు.
స్టేషనరీ దుకాణాల్లో రూ.500 నకిలీ నోట్లు కొనుగోలు చేసి, వాటిని చార్మినార్ ప్రాంతాల్లో బాధితులకు అంటగట్టి మంచి నోట్లు సంపాదించేవారు. ఇలా ఒంటరి మహిళలను, బ్యాంకుల నుంచి, ఏటీఎం సెంటర్ల నుంచి వచ్చే వారిని లక్ష్యంగా చేసుకొని ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు వారిపై నిఘా పెట్టి గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 20వేల నగదు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నిమ్స్ మ్యాన్‌హోల్లో శిశువు మృతదేహం
నకిలీ పోలీసుల ముఠా గుట్టు రట్టు
Read Latest Telangana News and National News