Share News

Cell Phone: విద్యార్థిని ఊపిరితీసిన సెల్‌ఫోన్‌.. ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:45 PM

సెల్‌ఫోన్‌ వాడకం తగ్గించాలని తల్లిదండ్రులు మందలించడంతో ప్లస్‌ టూ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. కడయాంపట్టి కరట్టుకోట ప్రాంతానికి చెందిన తంగరాజ్‌ కుమార్తె నివేద (17) కడయాంపట్టిలోని ప్రభుత్వ మోడల్‌ స్కూల్లో ప్లస్‌ టూ చదువుతోంది.

Cell Phone: విద్యార్థిని ఊపిరితీసిన సెల్‌ఫోన్‌.. ఏం జరిగిందంటే..

- సెల్‌ఫోన్‌ వాడొద్దని మందలింపు.. విద్యార్థిని ఆత్మహత్య

చెన్నై: సెల్‌ఫోన్‌(Cell Phone) వాడకం తగ్గించాలని తల్లిదండ్రులు మందలించడంతో ప్లస్‌ టూ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సేలం జిల్లాలో చోటుచేసుకుంది. కడయాంపట్టి కరట్టుకోట ప్రాంతానికి చెందిన తంగరాజ్‌ కుమార్తె నివేద (17) కడయాంపట్టిలోని ప్రభుత్వ మోడల్‌ స్కూల్లో ప్లస్‌ టూ చదువుతోంది. దీపావళి పండుగ రోజున నివేద(Nivedha) ఎక్కువగా సెల్‌ఫోన్‌ పట్టుకుని ఉండడంతో తల్లిదండ్రులు మందలించారు.


nani4.3.jpg

దీంతో మనస్తాపం చెందిన నివేద ఇంట్లో ఉన్న మాత్రలు ఒకేసారి 30 వేసుకుని స్పృహతప్పింది. తల్లిదండ్రులు ఆమెను వెంటనే ఓమలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ఫలించక గురువారం సాయంత్రం నివేద మృతిచెందింది. ఈ ఘటనపై తీవట్టిపట్టి పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..

కన్నీటి మంట ఊరట చెమ్మ!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2025 | 12:45 PM