Rachakonda Police: ముంబై నుంచి నగరానికి డ్రగ్స్ తెప్పించి..
ABN , Publish Date - Jul 04 , 2025 | 10:06 AM
ముంబై నుంచి డ్రగ్స్ తెప్పించి, నగరంలో విక్రయిస్తున్న ఇద్దరిని రాచకొండ నార్కొటిక్, ఈగల్ బృందం కలిసి అరెస్ట్ చేశాయి.
హైదరాబాద్ సిటీ: ముంబై నుంచి డ్రగ్స్ తెప్పించి, నగరంలో విక్రయిస్తున్న ఇద్దరిని రాచకొండ నార్కొటిక్, ఈగల్ బృందం కలిసి అరెస్ట్ చేశాయి. సికింద్రాబాద్ సింధీ కాలనీ(Secunderabad Sindhi Colony)కి చెందిన కంటం మోహిత్ (25)కు పబ్‌లో ఓ వ్యక్తి కలిసి ఓజీ కుష్, ఎక్స్‌ట్రసీ పిల్స్ ఇచ్చాడు. వాటికి అలవాటు పడ్డ మోహిత్ అవే డ్రగ్స్‌ను అమ్మి సొమ్ము చేసుకోవడం ప్రారంభించాడు.
ప్రధాన పెడ్లర్ ముంబై నుంచి కొరియర్, మనుషుల ద్వారా డ్రగ్స్‌ను మోహిత్‌కు చేరవేసేవాడు. ఎప్పటిలాగే మోహిత్ ముంబై నుంచి ఓజీ కుష్, ఎక్స్‌ట్రసీ పిల్స్‌ను ఆర్డర్ చేశాడు. ఈ ఆర్డర్‌ను ఇచ్చేందుకు మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన సెకెండ్ హ్యాండ్ కార్ల విక్రేత స్వప్నిల్ వార్థా నగరానికి వచ్చాడు.

పక్కా సమచారామందుకున్న రాచకొండ నార్కొటిక్(Rachakonda Narcotic), ఈగల్ బృంద సభ్యులు ఉప్పల్ స్టేడియం వద్ద డ్రగ్స్ డెలివరీ తీసుకుంటున్న మోహిత్, స్వప్నిల్‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.10.96 లక్షల విలువైన 200 గ్రాముల ఓజీ కుష్, 32 ఎక్స్‌ట్రసీ పిల్స్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
కాటేదాన్ రబ్బర్ కంపెనీలో అగ్ని ప్రమాదం
రిజర్వేషన్లు అమలు తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
Read Latest Telangana News and National News