Hyderabad: వీసాలేదు.. పాస్‌పోర్టు లేదు.. నగరంలో పట్టుబడ్డ నైజీరియన్
ABN , Publish Date - Feb 06 , 2025 | 08:52 AM
ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేకుండా నగరంలో తిరుగుతున్న నైజీరియన్(Nigerian)ను హెచ్ న్యూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన క్రమంలో ముంబైలో అరెస్టయి, రెండేళ్లు జైలు జీవితం గడిపి వచ్చినట్లు తేలింది.
- డ్రగ్స్ స్మగ్లర్‌గా మారకముందే స్వదేశానికి పంపే ప్రయత్నం
హైదరాబాద్ సిటీ: ఎలాంటి వీసా, పాస్‌పోర్టు లేకుండా నగరంలో తిరుగుతున్న నైజీరియన్(Nigerian)ను హెచ్ న్యూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించిన క్రమంలో ముంబైలో అరెస్టయి, రెండేళ్లు జైలు జీవితం గడిపి వచ్చినట్లు తేలింది. అతడు డ్రగ్స్ స్మగ్లర్‌గా మారకముందే వెంటనే డిపోటేషన్ ద్వారా నైజీరియాకు పంపాలని సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(City Police Commissioner CV Anand) ఆదేశించారని హెచ్ న్యూ డీసీపీ వైవీ సుదీంద్ర తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తాం..
బషీర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ పూర్తి వివరాలు వెల్లడించారు. నైజీరియాకు చెందిన ఇకెచుకువు సెల్విస్టర్ అలియాస్ సెల్విస్టర్ 2012లో బిజినెస్ వీసాపై ఇండియాకు వచ్చాడు. ముంబైలో క్లాత్ బిజినెస్ చేస్తూ.. ఇక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేసిన క్లాత్స్‌ను నైజీరియాకు ఎగుమతి చేసేవాడు. 2019లో ముంబై పోలీసులు సెల్విస్టర్‌ను పాస్‌పోర్టు కేసులో అరెస్టు చేశారు. దాంతో అతను ముంబై సెంట్రల్ జైల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. ఆ తర్వాత ముంబైలోని ఉల్వే ప్రాంతంలో ఉంటున్న నైజీరియన్ స్నేహితుల వద్దకు చేరి అక్కడే ఉంటున్నాడు. స్నేహితులంతా డ్రగ్స్ సరఫరాలో ఆరితేరుతుండగా.. అతను మాత్రం ఇంకా అలాంటి నేరాలకు పాల్పడలేదు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్(Hyderabad)లో ఉంటున్న స్నేహితుల వద్దకు వచ్చాడు. వారు కూడా ముంబై, బెంగళూరు(Mumbai, Bangalore)కు చెందిన ప్రధాన డ్రగ్స్ స్మగ్లర్స్‌తో లింకులు ఉన్నవారే కావడం గమనార్హం. సెల్విస్టర్ వారితో కలిసి నగరంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో హెచ్ న్యూ పోలీసులకు సమాచారం అందింది. ఇన్‌స్పెక్టర్ డానియెల్ టీమ్ రంగంలోకి దిగి సెల్విస్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని విచారించగా.. వీసాగానీ, ఎలాంటి పాస్‌పోర్టుగానీ లేవని, అదే కేసులో గతంలో ముంబైలో అరెస్టయినట్లు తేలింది. హెచ్ న్యూ పోలీసులు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో సహకారంతో డిపోటేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని డీసీపీ సుదీంద్ర వెల్లడించారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: అది అసమగ్ర కులగణన
ఈవార్తను కూడా చదవండి: GHMC: ప్యారానగర్ డంపుయార్డ్ పనులు ప్రారంభం
ఈవార్తను కూడా చదవండి: Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్!
ఈవార్తను కూడా చదవండి: అర్వింద్ మాటలు కాదు.. చేతల్లో చూపించాలి..: కవిత
Read Latest Telangana News and National News