Share News

Hyderabad: కండలు పెంచుకునేందుకు ఇంజక్షన్లు.. జిమ్‌లకు వెళ్లే వారే లక్ష్యంగా అక్రమంగా మందుల విక్రయం

ABN , Publish Date - Jan 21 , 2025 | 07:47 AM

కండలు పెంచే ఆసక్తితో జిమ్‌లకు వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇంజక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో సిబ్బంది అరెస్ట్‌ చేశారు.

Hyderabad: కండలు పెంచుకునేందుకు ఇంజక్షన్లు.. జిమ్‌లకు వెళ్లే వారే లక్ష్యంగా అక్రమంగా మందుల విక్రయం

- నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: కండలు పెంచే ఆసక్తితో జిమ్‌లకు వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకొని నిబంధనలకు విరుద్ధంగా ఇంజక్షన్లను విక్రయిస్తున్న వ్యక్తిని తెలంగాణ డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌, యాంటీ నార్కోటిక్‌ బ్యూరో సిబ్బంది అరెస్ట్‌ చేశారు. డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ వి.బి.కమలాసన్‌ రెడ్డి(V.B. Kamalasan Reddy) తెలిపిన వివరాల ప్రకారం.. మణికొండ(Manikonda) జాగీర్‌ శివాజీనగర్‌లో నివసిస్తున్న ఆకాష్‌ మెఫెంటెర్మైన్‌ సల్ఫేట్‌ ఇంజక్షన్లు విక్రయిస్తున్నట్లు డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌, యాంటీ నార్కోటిక్‌ బ్యూరోకు సమాచారం అందింది.

ఈ వార్తను కూడా చదవండి: HYDRA: హైడ్రాకు భారీగా ఫిర్యాదుల వెల్లువ..


ఈనెల 18న అధికారులు అతడి ఇంటిపై దాడి చేశారు. అక్రమంగా నిల్వచేసిన 14 వయల్స్‌ టర్మివా ఇంజక్షన్స్‌, 4 వయల్స్‌ టర్మిన్‌ ఇంజక్షన్‌ (మెఫెంటెర్మైన్‌ సల్ఫేట్‌)లను స్వాధీనం చేసుకున్నారు. మెఫెంటెర్మైన్‌ సల్ఫేట్‌ గుండె సంబంధిత రోగాలను నయం చేసేందుకు వినియోగిస్తారు. నోరాడ్రినలిన్‌ విడుదలను పెంచడం ద్వారా, ఔషధం కార్డియాక్‌ అవుట్‌పుట్‌ను పెంచుతుంది, అదే సమయంలో వేగంగా రక్తపోటును పెంచుతుంది. ఈ మందులను జిమ్‌లలో వినియోగించడం నిషేధం.


city3.2.jpg

వ్యాయామశాలలకు వెళ్లేవారితోపాటు క్రీడా పోటీల్లో పాల్గొనే వారు శారీరకదారుడ్యం కోసం ఈ ఇంజక్షన్లను వాడుతున్నారు. దాడుల్లో డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌(Drug Control Administration)కు చెందిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు డి.శ్వేత బిందు, కె.అవినాష్‌, జి.రవి కిరణ్‌ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు, సైకోట్రోపిక్‌ పదార్థాల తయారీ, వినియోగిస్తున్నట్లు తెలిస్తే డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ర్టేషన్‌ టోల్‌ ఫ్రీ నంబరు 18005996969కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.


ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!

ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్‌?

ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్‌ప్లాజా

ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2025 | 07:47 AM