Hyderabad: అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి.. ఆత్మహత్యా.. లేక..
ABN , Publish Date - Nov 11 , 2025 | 08:15 AM
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు చెట్టుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి... రాజేంద్రనగర్ హనుమాన్‌నగర్‌కు చెందిన దుగ్గన్న కుమారుడు ధనూష్(22) మానస హిల్స్‌లోని ప్రెస్టీజ్ నిర్వణలో పనిచేస్తున్నాడు.
రాజేంద్రనగర్(హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు చెట్టుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి... రాజేంద్రనగర్ హనుమాన్‌నగర్(Rajendranagar Hanumannagar)కు చెందిన దుగ్గన్న కుమారుడు ధనూష్(22) మానస హిల్స్‌లోని ప్రెస్టీజ్ నిర్వణలో పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా అతడికి ఆరోగ్యం బాగోలేదు. ఆదివారం ఆసుపత్రికి వెళ్తున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకూ ఇంటికి రాలేదు. కుమారుడికి ఫోన్ చేస్తే తీయలేదు.
సోమవారం ఉదయం ధనూష్ మిత్రులు అతడి కోసం గాలిస్తూ హిమాయత్‌సాగర్ తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ రీసెర్చ్ లాబరేటరీస్ ప్రాంతానికి వెళ్లగా నిర్మాణుష్య ప్రాంతంలో ఉన్న చెట్టుకు చీరతో ఉరి వేసుకొని కనిపించాడు. అతడి ద్విచక్ర వాహనం (టీఎస్07 వీ 3648) అదే ప్రాంతంలో పార్కు చేసి ఉంది. గమనించిన మిత్రులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. రాజేంద్రనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చూరీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నా కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయి: దుగ్గన్న
తన కుమారుడు ధనూష్ మరణంపై అనుమానాలు ఉన్నాయని తండ్రి దుగ్గన్న వాపోయారు. ఆసుపత్రికి వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుపుతున్నారని వాపోయారు. ఒక అమ్మాయితో మాట్లాడేవాడని తెలిసిందని అన్నారు. ఒక్కడే వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా.. ఇంకెవరైన వెళ్లారా అని అనుమానాలు వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
10 పరీక్షల ఫీజు చెల్లింపునకు 25 వరకు గడువు
Read Latest Telangana News and National News