Share News

Hyderabad: జైలుకెళ్లొచ్చినా.. బుద్ధి మారలేదుగా..

ABN , Publish Date - Jul 26 , 2025 | 09:56 AM

తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ పాతనేరస్తురాలిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్ద నుంచి 22.3 తులాల బంగారు నగలు, 5 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: జైలుకెళ్లొచ్చినా.. బుద్ధి మారలేదుగా..

- జల్సాల కోసం ఇళ్లలో చోరీలు

- పాత నేరస్తురాలి అరెస్టు

- 22.3తులాల బంగారం, వెండి స్వాధీనం

హైదరాబాద్: తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్‌ చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఓ పాతనేరస్తురాలిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్ద నుంచి 22.3 తులాల బంగారు నగలు, 5 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్‌ డీసీపీ కార్యాలయంలో శుక్రవారం డీసీపీ డీసీపీ సురేష్‌కుమార్‌ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం...ఉత్తరప్రదేశ్‌లోని పిప్రోలి గ్రామానికి చెందిన బేబి అలియాస్‌ అరోహి (21) కొంతకాలంగా నగరంలోని మధునగర్‌లో నివాసముంటూ సేల్స్‌గార్ల్‌గా పని చేస్తోంది.


జల్సాలకు అలవాటుపడిన బేబీ ఫేస్‌బుక్‌లో తన పేరు ఫ్రాంక్లిన్‌ అలియాస్‌ చింటూ, కర్ణాటక(Karnataka) ప్రాంతంలోని బెల్గావిగా పరిచయం చేసుకుంది. డబ్బు సంపాదన కోసం తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగతనాలు చేస్తోంది. గతంలో బోరంబండ ప్రాంతంలో రెండు దొంగతనాలు చేసి చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail)లో శిక్ష అనుభవించింది. అయినా ఆమె వక్రబుద్ధి మారలేదు. గత నెల 28వ తేదీన జైలు నుంచి విడుదలైన బేబీ ఈనెల 18వ జగద్గిరిగుట్ట ప్రాంతంలోని ఆల్విన్‌కాలనీకి చెందిన విప్పర్తి చిరంజీవి(39) అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా బయటకు వెళ్లాడు.


city6.2.jpg

తాళాన్ని చెప్పుల స్టాండ్‌ లోని హెల్మెట్‌లో పెట్టి వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం తెరచి ఇంట్లోని బీరువాలో గల 22.3తులాల బంగారు నగలు, 5తులాల వెండి, దొంగిలించుకుపోయారు. బాధితుడు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల ఫూటేజ్‌ ఆధారంగా దొంగతనాకి పాల్పడింది. బేబి అని గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీకి పాల్పడినట్టు అంగీకరించింది. బంగారు నగలు, వెండి స్వాధీనం చేసుకుని ఆమెను రిమాండ్‌ కు తరలించారు. విలేకరుల సమావేశంలో బాలానగర్‌ ఏసీపీ పి.నరేష్‌రెడ్డి, జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ, డీఐ పి.నరేందర్‌రెడ్డి, ఇతర సిబ్బందిపాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

యాదగిరిగుట్ట సత్యదేవుడి వ్రత టికెట్‌ ధర పెంపు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2025 | 09:56 AM