Hyderabad: శరీరంపై 25 కత్తిగాట్లు..
ABN , Publish Date - Dec 10 , 2025 | 10:47 AM
భార్యపై భర్త కత్తితో దాడిచేసిన సంఘటన నగరంలోని వారాసిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఆమెపై 25 కత్తిగాట్లు ఉండటాన్ని గుర్తించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. ఇందుకు సంబంధించిన వివకాలిలా ఉన్నాయి.
- భర్తను రిమాండ్ చేసిన పోలీసులు
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలుఫ రాంనగర్‌లో ఘటన
హైదరాబాద్: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకోవటంతో భర్త తాగిన మైకంలో భార్య శరీరంపై దారుణంగా 25చోట్ల కత్తితో పొడిచి గాట్లు పెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వారాసిగూడ పోలీస్స్టేషన్(Varasiguda Police Station) పరిధిలో రాంనగర్‌లో చోటు చేసుకుంది. ప్రసుత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాంనగర్ లోటస్ మోడల్ స్కూలు సమీపంలో ఓ అపార్ట్‌మెంట్‌లో సిహెచ్.శైలజ(32) వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అపార్ట్‌మెంట్‌లోనే వాచ్‌మెన్ రూమ్‌లో ఉంటుంది.
శైలజ భర్త చాకలి గోపాల్(38) ప్రైవేట్ బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గోపాల్ మద్యానికి బానిసై తరచూ తాగి వచ్చి భార్యను వేధించటంతో పాటు తగాదాలు పడేవాడు. భర్త వేధింపులు భరించలేక కొన్నిరోజుల క్రితం సంగారెడ్డి హతోరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని అక్కడి పోలీసులు సలహా ఇచ్చారు. గత వారం రోజులుగా గోపాల్ పనికి వెళ్లకుండా నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను మరింత వేధించసాగాడు. దీంతో శైలజ తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పగా తల్లి వచ్చి శైలజతో ఉంటుంది.
6వ తేదీ ఉదయం నుంచే మద్యం తాగుతూ భార్యను మాటలతో మరింత వేధించాడు. అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త గోపాల్ 7వ తేదీ రాత్రి ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని నిద్రపోతున్న భార్యను విచక్షణ రహితంగా పొడిచాడు. శైలజ తల్లి కేకలు వేయటంతో పక్కింటి మహిళ కుమారి రావటంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపుమడుగులో తీవ్రగాయాలై, అపారకస్మితిలో ఉన్న శైలజను స్ధానికులు, కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వారు చికిత్సకు నిరాకరించటంతో అంబర్‌పేట్‌లోని సీజన్ ఆస్పత్రిలో చేర్పించారు.
సమాచారమందుకున్న పోలీసులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శైలజ నుంచి వివరాలు సేకరించారు. శైలజ శరీరంపై 25 కత్తిగాట్లు పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం శైలజ భర్తను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రసుత్తం శైలజ పరిస్థితి ఆందోళకరంగా ఉందని బంధువులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News