Share News

Hyderabad: గోడకేసి కొట్టి.. ఆపై గొంతు నులిమి..

ABN , Publish Date - May 28 , 2025 | 08:09 AM

తాళికట్టి జీవితాన్ని ఇచ్చిన భర్తను దారుణంగా హతమార్చిందో భార్య. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని హతమార్చింది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: గోడకేసి కొట్టి.. ఆపై గొంతు నులిమి..

- భర్తను హత్య చేసిన భార్య.. కేసు నమోదు

హైదరాబాద్: భర్తను గోడకేసి కొట్టి.. ఆపై గొంతు నులిమి హత్య చేసిందో మహిళ. అనంతరం ప్రమాదవశాత్తూ చనిపోయాడని పోలీసులతో సహా అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వనస్థలిపురం పోలీసుస్టేషన్‌(Vanasthalipuram Police Station) పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం భావత్‌తండాకు చెందిన సభావత్‌ కిషన్‌ నాయక్‌(40), శిరీష దంపతులు వనస్థలిపురంలో నివాసముంటున్నారు.


వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శిరీషకు మరో వ్యక్తితో అక్రమ సంబందం ఏర్పడింది. విషయం తెలుసుకున్న కిషన్‌ నాయక్‌ తన భార్య శిరీషను మందలించాడు. రెండు నెలల క్రితం వనస్థపురంలోని హిల్‌కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం మద్యం తాగిన కిషన్‌ నాయక్‌ తన భార్య పనిచేసే వద్దకు వెళ్లి ఇంటికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో మరోసారి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.


కోపోద్రిక్తురాలైన శిరీష భర్త కిషన్‌ నాయక్‌ను గట్టిగా గోడకేసి కొట్టింది. అంతటితో ఆగకుండా ఆయన గొంతును గట్టిగా నులిమి హత్య చేసింది. ఆపై అంబులెన్స్‌లో వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది. కిషన్‌ నాయక్‌కు పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.


city3.2.jpg

కిషన్‌ నాయక్‌ మొదటి భార్య కూతురు బిందు తన తండ్రిని శిరీష చున్నీతో హత్య చేసిందని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బిందు ఫిర్యాదు మేరకు శిరీషపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు, రక్తపు మరకలు లేవని వనస్థలిపురం ఏసీపీ పల్లె కాశిరెడ్డి తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates Today: గుడ్ న్యూస్..వరుసగా రెండోరోజు తగ్గిన బంగారం ధరలు..

Miss World 2025: మిస్‌ వరల్డ్‌ ఫైనల్స్‌... 3 గంటలు.. 3500 మంది ప్రేక్షకులు

Read Latest Telangana News and National News

Updated Date - May 28 , 2025 | 08:09 AM