Share News

Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి.. డబ్బు తీసుకుని వంచించి..

ABN , Publish Date - Jun 17 , 2025 | 09:47 AM

ఓ వివాహ వెబ్‌సైట్‌లో బిజినెన్‌ మ్యాన్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు పరిచయం ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు మారింది. ఓ హోటల్‌లో అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఆమె నుంచి రూ.లక్షల్లో డబ్బు కూడా తీసుకున్నాడు.

Hyderabad: పెళ్లి పేరుతో నమ్మించి.. డబ్బు తీసుకుని వంచించి..

- వ్యాపారం పేరుతో మహిళకు రూ.24 లక్షలు టోకరా

- పలుమార్లు లైంగికదాడి

- పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

హైదరాబాద్: ఓ వివాహ వెబ్‌సైట్‌(Website)లో బిజినెన్‌ మ్యాన్‌గా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు పరిచయం ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు మారింది. ఓ హోటల్‌లో అప్పుడప్పుడూ కలుసుకునేవారు. ఆమె నుంచి రూ.లక్షల్లో డబ్బు కూడా తీసుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని, డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే ఇద్దరూ కలిసి ఉన్నప్పటి వీడియోలు వైరల్‌ చేస్తానని మహిళను బెదిరించడంతో పాటు ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..


city3.jpg

నగరంలోని ఓ మహిళకు షాదీ డాట్‌ కామ్‌లో ముంబైకి చెందిన కల్ఫేష్‌ కక్కడ్‌తో 2022లో పరిచయం ఏర్పడింది. ఆమెతో పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అప్పుడప్పుడు నగరానికి వచ్చి ఆమెను కలిసేవాడు. జనవరి 23న కల్ఫేష్‌ నగరానికి వచ్చి బేగంపేట(Begumpet)లో ఉన్న ఓ హోటల్‌లో దిగి ఫోన్‌ చేయడంతో ఆమె అక్కడికి వెళ్లింది. తన వ్యాపార అభివృద్ధికి డబ్బు కావాలని కోరడంతో రెండు విడతలుగా రూ.24లక్షలు ఇచ్చింది.


ఆ తర్వాత ముఖం చాటేయడంతో తన డబ్బు తిరిగి ఇవ్వాలని, పెళ్లి చేసుకోవాలని పలుమార్లు ఆయనను ఫోన్‌లో నిలదీయడంతో మనం కలిసి ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఈనెల 14న బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

గరిష్టానికి చేరుకుని, మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు

‘ధరణి’పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ షురూ

Read Latest Telangana News and National News

Updated Date - Jun 17 , 2025 | 09:50 AM