Share News

Hyderabad: రిటర్న్‌ స్టాక్స్‌ తక్కువ ధరకంటూ బురిడీ..

ABN , Publish Date - May 30 , 2025 | 08:38 AM

హైదరాబాద్ నగరంలో సైబర్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ మోసానికి బలవుతూనే ఉన్నారు. లక్షల్లో నష్టపోతూనే ఉన్నారు. ఈ మోసాలపై ప్రజల్లో అవగాహన తక్కువగా ఉండడంతో మోసపోవాల్సి వస్తోంది. తాజాగా నగరానికి చెందిన ఓ వ్యాపారిని బురిడీ కొట్టించి రూ.2.69లక్షలు కొట్టేశారు. ఇక వివరాల్లోకి వెళితే..

Hyderabad: రిటర్న్‌ స్టాక్స్‌ తక్కువ ధరకంటూ బురిడీ..

- రూ.2.69లక్షలు కాజేత

- సైబర్‌ మోసానికి బలైన వ్యాపారి

హైదరాబాద్‌ సిటీ: అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా రిటర్న్‌ అయిన వస్తువుల స్టాక్‌ను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ నగర వ్యాపారిని బురిడీ కొట్టించిన సైబర్‌ క్రిమినల్స్‌ అతని నుంచి రూ. 2.69లక్షలు కాజేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన వ్యాపారికి ఇటీవల ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఫ్లిప్‌కార్టు, అమెజాన్‌లలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా రిటర్న్‌ అయిన వస్తువుల స్టాక్‌ను హోల్‌సేల్‌గా విక్రయించే విభాగం అధిపతిగా పరిచయం చేసుకున్నాడు.


రిటర్న్‌ అయిన ఫ్యాన్‌లు, బ్యాగులు, టపాసులు, గడియారాలు, బూట్లు, స్కూలు బ్యాగుల స్టాక్‌ ఎక్కుగా ఉందని, వాటిని తక్కువ ధరకు డోర్‌ డెలివరీ చేస్తామని నమ్మించాడు. అంతేకాకుండా అతని ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ కార్డు వాట్సాప్‌ చేశాడు. అవి నిజమైనవని తేలడంతో బాధితుడు 750 స్కూలు బ్యాగులు, 25 మిస్టు ఫ్యాన్లు, 60 సాధారణ ఫ్యాన్‌లు ఆర్డర్‌ చేశాడు. అయితే, వాటిని ట్రాన్స్‌పోర్టులో పశ్చిమబెంగాల్‌ నుంచి పంపిస్తున్నామని, 5 రోజుల్లో డోర్‌డెలివరీ అవుతాయని, అవసరమైన రవాణా చార్జీలు చెల్లించాలని కోరాడు.


city2.2.jpg

దాంతో బాధితుడు ముందు గా రూ.18వేలు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎంతకీ వస్తువులు డెలివరీ కాకపోవడంతో ఆరా తీయగా.. 25రోజుల తర్వాత స్పందించిన నిందితుడు ట్రాన్స్‌పోర్టు వెహికిల్‌ ప్ర్లాబ్లమ్‌ వచ్చిందని, వరంగల్‌ సమీపంలో ఆగిపోయిందని, కొంత డబ్బు పంపిస్తే సమస్య పరిష్కరించుకొని వెహికిల్‌ బయల్దేరుతుందని సమాధానమిచ్చాడు.


తర్వాత రెండు రోజులకు నిందితుడు ఫోన్‌చేసి, తానే స్వయంగా రైల్లో బయల్దేరుతున్నానని నమ్మించాడు. అలా రకరకాలుగా నమ్మించిన నిందితుడు వివిధ కారణాలు చెప్తూ.. విడతలవారీగా రూ. 2.69లక్షలు కొల్లగొట్టాడు. ఆ తర్వాత ఎంతకీ వస్తువులు డెలివరీ కాకపోవడం తో బాధితుడు ఆరా తీయగా అది సైబర్‌ మోసమని తేలింది. బాధితుడు సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 08:38 AM