Share News

Hyderabad: బ్యానర్‌ విషయమై గొడవ.. రౌడీమూక దాడి

ABN , Publish Date - Jul 29 , 2025 | 01:57 PM

బ్యానర్‌ విషయమై ఓ రౌడీమూక యువకుడిని దుర్భాషలాడుతూ అతనిపై దాడి చేయడంతో అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసి వందలాదిగా మృతుడి ఇంటికి సోమవారం చేరుకున్న స్థానికులు ఆగ్రహిస్తూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారిపైకి దూసుకెళ్లారు.

Hyderabad: బ్యానర్‌ విషయమై గొడవ.. రౌడీమూక దాడి

- అవమానంతో యువకుడి ఆత్మహత్య

- ఆగ్రహించిన స్థానికులు

- పోలీసులపైకి దూసుకెళ్లిన వైనం

- ఖైరతాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత

- సముదాయించిన పోలీసులు

హైదరాబాద్: బ్యానర్‌ విషయమై ఓ రౌడీమూక యువకుడిని దుర్భాషలాడుతూ అతనిపై దాడి చేయడంతో అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలిసి వందలాదిగా మృతుడి ఇంటికి సోమవారం చేరుకున్న స్థానికులు ఆగ్రహిస్తూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారిపైకి దూసుకెళ్లారు. మృతదేహంతో పోలీస్ స్టేషన్‌ ఎదుట బైఠాయిస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులు నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెబుతూ వారిని సముదాయించి యువకుడి అంత్యక్రియలు చేయించారు. ఈ సంఘటన ఖైరతాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది.


వివరాల్లోకి వెళితే.. ఖైరతాబాద్‌ న్యూ సీఐబీ క్వార్టర్స్‌ నివాసి వీరబోయిన ముఖేష్ బాబు (30) స్థానిక గజ్జెలమ్మ దేవాలయ నిర్వాహక కుటుంబసభ్యుడు. బోనాల పండగ సందర్భంగా బ్యానర్లు కట్టే విషయంలో వికేష్‌, అతడి అనుచరవర్గంతో ముఖే్‌షబాబు మధ్య మూడు రోజులుగా వివాదం నడిచింది. ఆదివారం రాత్రి కొందరు వికేష్‌ అనుచరులు ముఖేష్‌ దుకాణం (ఐస్‌క్రీం పార్లర్‌) వద్దకు వచ్చి గొడవకు దిగడంతో మధ్యవర్తులు బుజ్జగించారు. వెళ్లిపోయిన వారు కొంతసేపటికి మరికొంత మందితో కలసి వచ్చి ముఖేష్ పై పై దాడి చేశారు.


తీవ్ర పరుషపదజాలంతో అతన్ని దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ముఖేష్‌ ఇంటికి వచ్చి ఉరేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వికేష్‌, అతని అనుచరుల దాడి వల్లే ఆత్యహత్యకు పాల్పడ్డాడని సోదరుడు రాకేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ముఖేష్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


పోలీసులపై ఆగ్రహం

అందరితో కలివిడిగా ఉంటూ మృదుస్వభావిగా ఉండే ముఖే్‌షబాబు ఆత్మహత్యతో ఖైరతాబాద్‌లో విషాదం నెలకొంది. మృతుడిపై దాడి చేయడంతో పాటు అతడిని చంపేస్తామని అందరిముందు అవమానించినందుకే మనస్తాపానికి గురై ముఖేష్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానిక యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ముఖేష్‌ ఇంటి సమీపంలో ఉన్న పోలీసులపైకి వారు దూసుకెళ్లి నిలదీశారు. పోలీసుల అండతోనే వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సెటిల్‌మెంట్లు చేస్తున్నారని,


ఎన్నో విషయాల్లో వారిపై కేసులు లేకుండా చేయడం వల్లే రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికే్‌షముఠాను ఖైరతాబాద్‌లో కనిపించకుండా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బైఠాయించారు. అయితే, ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, అందరినీ అరెస్టు చేసి శిక్షిస్తామని హామీ ఇస్తూ పోలీసులు వారిని బుజ్జగించి ఆందోళన విరమించారు. ఇదిలాఉంటే, ముఖే్‌షబాబు ఆత్మహత్యకు సంఘీభావంగా రేపు భారీ నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ముదిరాజ్‌ సంఘాల నేతలు తెలిపారు.


పోలీసులను నిలదీసిన ఎమ్మెల్యే

ముఖే్‌షపై దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని, లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఎమ్మెల్యే దానం పోలీసులకు వార్నింగ్‌ ఇచ్చారు. ఈ కేసులో ఏ మాత్రం అలసత్వం వహించినా సీపీ వద్దకు వెళ్లి కూర్చుంటానని హెచ్చరించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డిలు ముఖేష్‌ కుటుంబ సభ్యులను ఓదార్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌ సహా ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు

ప్రధాని మోదీని బీసీ కాదనడం సిగ్గుచేటు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 29 , 2025 | 01:57 PM