Hyderabad: తండ్రి వాచ్‌మన్‌గా పనిచేసే అపార్టుమెంట్‌లో కొడుకు దొంగతనాలు
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:58 AM
కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో తండ్రి వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తుండగా కొడుకు అదే అపార్టుమెంటులో దొంగతనాలు చేస్తూ ఏడాది కాలంగా పోలీసులకు సవాల్ విసిరిన కేసును కూకట్‌పల్లి పోలీసులు ఛేదించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: కూకట్‌పల్లి(Kukatpally) బాలాజీ నగర్‌లో తండ్రి వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తుండగా కొడుకు అదే అపార్టుమెంటులో దొంగతనాలు చేస్తూ ఏడాది కాలంగా పోలీసులకు సవాల్ విసిరిన కేసును కూకట్‌పల్లి పోలీసులు ఛేదించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం కూకట్‌పల్లి పీఎస్‌లో ఏసీపీ రవికిరణ్ రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ కే.వి.సుబ్బారావు, డీఐ కొండల్‌రావుతో కలిసి డీసీపీ సురేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యోగేష్ దాకన్ బాలాజీ నిలయం అపార్టుమెంటుకు వాచ్‌మెన్‌గా నాలుగేళ్లుగా పనిచేస్తున్నాడు.
అతని కుమారుడు ఆర్యన్ యోగేష్(19) గత ఏడాది అదే అపార్టుమెంటులో 3వ ఫ్లోర్‌లో 29 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. మూడు రోజుల క్రితం రెండో అంతస్తులో బంగారు ఆభరణాలు పోయినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8:30 గంటలకు ఉషా ముళ్లపూడి కమాన్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉండటంతో యోగేష్(Yogesh)ను అదుపులోకి తీసుకున్నారు.

అతడి ప్యాంటు జేబులో ఆభరణాలను కొనుగొన్నారు. వెంటనే పీఎ్‌సకు తరలించి విచారించగా గతంలో కూడా దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడి నుంచి 29 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని డీసీిపీ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండుకు తరలించారు. ఓ కారు, డిజిటల్ కెమెరా దొంగలను సైతం పోలీసులు రిమాండుకు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News