Share News

Hyderabad: ఇదోరకం మోసం.. తక్కువ కమీషన్‌కు డబ్బు పేరుతో..

ABN , Publish Date - May 17 , 2025 | 09:42 AM

అవతలి వ్యక్తి ఏమై పోయినా ఫర్యాలేదు... మా జేబుల్లోకి డబ్బులు వస్తే చాలు. తాను చేసేది అక్రమమా, సక్రమమా అన్నది కూడా అవసరం లేదు.. ముందైతే నా జేబులోకి డబ్బు రావాలి అంతే.. అలా తయారైంది ప్రస్తుత పరిస్థితి. తక్కువ కమీషన్‌ తీసుకొని క్రెడిట్‌ కార్డు నుంచి డబ్బులు ఇస్తానని మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..

Hyderabad: ఇదోరకం మోసం.. తక్కువ కమీషన్‌కు డబ్బు పేరుతో..

- రూ.2లక్షలు కాజేసిన టెకీ

హైదరాబాద్‌ సిటీ: తక్కువ కమీషన్‌ తీసుకొని క్రెడిట్‌ కార్డు నుంచి డబ్బులు ఇస్తానని మోసం చేసిన వ్యక్తిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం అధికారులు అరెస్ట్‌ చేశారు. అదిలాబాద్‌ జిల్లా తాళ్లపల్లికి చెందిన ముత్తినేని రాజశేఖర్‌ (26) ఐటీ ఉద్యోగి. ఇతడు సాంబశివ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ ద్వారా ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నానని సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. క్రెడిట్‌ కార్డు నుంచి డబ్బు ఇచ్చేందుకు కేవలం 1.8 శాతం మాత్రమే చార్జీలు తీసుకుంటానని ప్రచారం చేసుకున్నాడు.

ఈ వార్తను కూడా చదవండి: Electricity: ఆ ఏరియాల్లో విద్యుత్ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..


city4.2.jpg

నమ్మిన నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఇతడిని సంప్రదించాడు. రాజశేఖర్‌కు, క్రెడిట్‌ కార్డు వివరాలు, సీవీవీ, ఓటీపీలు చెప్పాడు. ఈ వివరాలతో రాజశేఖర్‌ రెండుసార్లు క్రెడిట్‌ కార్డు నుంచి రూ.1.99 లక్షలు విత్‌డ్రా చేసుకున్న తర్వాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడు రాజశేఖర్‌ను గుర్తించి అరెస్ట్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold And Silver Rate: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..

Variety Recipes: నోరూరించే రాగి రుచులు

Gachibowli: రేవంత్‌ కక్కుర్తి వల్లే ప్రకృతి విధ్వంసం: వివేకానంద

సురేఖ తెగించి కమీషన్‌ మంత్రుల పేర్లు చెప్పాలి

భారత వైమానిక రక్షణ దళంలో తెలుగువాడు

Read Latest Telangana News and National News

Updated Date - May 17 , 2025 | 09:42 AM