Share News

Hyderabad: తన భార్యతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని...

ABN , Publish Date - Oct 23 , 2025 | 10:16 AM

తన భార్యతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని కోపంతో ఓ యువకుడు స్నేహితుడిపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించిన సంఘటన బాలాపూర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాలాపూర్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: తన భార్యతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని...

- స్నేహితుడిపై పెట్రోల్‌ పోసి నిప్పు

- వ్యక్తికి తీవ్ర గాయాలు

హైదరాబాద్: తన భార్యతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని కోపంతో ఓ యువకుడు స్నేహితుడిపై పెట్రోల్‌ పోసి నిప్పు అంటించిన సంఘటన బాలాపూర్‌ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాలాపూర్‌ పోలీసులు(Balapur Police) తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రకుంట ప్రాంతానికి చెందిన అబ్దుల్‌ ఫతే అలీ(32), జహంగీర్‌ స్నేహితులు, బుధవారం సాయంత్రం అబ్దుల్‌ ఫతే అలీ, ఇంటికి వచ్చిన జహంగీర్‌ ఇద్దరు కలిసి మద్యం తాగారు.


city7.2.jpg

నా భార్యతో ఎందుకు ఫోన్‌లో మాట్లాడుతున్నావని జహంగీర్‌ అలీ(Jahangir Ali)తో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఫతే అలీపై పోసి నిప్పు అంటించాడు. ఫతే అలీ కేకలు వేయడంతో పరిసర ఇళ్ల వారు వచ్చి మంటలను అర్పారు. సమాచారం తెలిసిన బాలాపూర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫతే అలీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధర మరింత తగ్గింది..

మావోయిస్టు మద్దతుదారులపై నజర్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 23 , 2025 | 10:22 AM