Hyderabad: మార్కెట్లోకి నకిలీ మెహందీ...
ABN , Publish Date - Oct 02 , 2025 | 10:05 AM
రాచీ పేరుతో నకిలీ మెహందీ విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వట్టేపల్లికి చెందిన మహ్మద్ అబ్దుల్ వసీం (54) మెహందీ ప్రొడక్ట్ తయారీ లైసెన్స్ తీసుకొని గౌస్‌నగర్‌లో మశ్రత్ మెహందీ పేరుతో కోన్‌లు తయారు చేసి విక్రయిస్తున్నాడు.
- నిర్వాహకుడి అరెస్ట్
హైదరాబాద్ సిటీ: కరాచీ(Karachi) పేరుతో నకిలీ మెహందీ విక్రయిస్తున్న వ్యక్తిని సౌత్‌ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, బండ్లగూడ పోలీసులు(Bandlaguda Police) అరెస్ట్ చేశారు. వట్టేపల్లికి చెందిన మహ్మద్ అబ్దుల్ వసీం (54) మెహందీ ప్రొడక్ట్ తయారీ లైసెన్స్ తీసుకొని గౌస్‌నగర్‌లో మశ్రత్ మెహందీ పేరుతో కోన్‌లు తయారు చేసి విక్రయిస్తున్నాడు.

అతడు తయారు చేసిన మెహందీ అమ్ముడు కాకపోవడంతో మార్కెట్లో డిమాండ్ ఉన్న కరాచీ మెహందీ(Karachi Mehndi) పేరుతో మార్కెట్‌లోకి సరఫరా చేస్తున్నాడు. పోలీసులు అతడి కార్ఖానాపై దాడి చేశారు. రూ.5లక్షల విలువైన ముడిసరుకు, కోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధర తగ్గేదేలే.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
టాప్ ప్లేస్‌లో అంబానీ.. దేశంలో అత్యంత సంపన్నులు వీరే..
Read Latest Telangana News and National News