Share News

Hyderabad: మానవత్వం మరిచి.. మృగాలుగా మారి..

ABN , Publish Date - Sep 25 , 2025 | 09:58 AM

ఒంటరిగా ఉన్న మహిళను చూసి మానవత్వాన్ని మరిచి మానవ మృగాలుగా మారారు. సామూహిక లైంగికదాడికి పాల్పడడమే కాకుండా అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీశారు. ఈనెల 15న కిస్మత్‌పూర్‌ బ్రిడ్జి కింద జరిగిన మహిళ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Hyderabad: మానవత్వం మరిచి.. మృగాలుగా మారి..

- కిస్మత్‌పూర్‌లో మహిళ హత్య కేసులో విస్తుపోయే విషయాలు

హైదరాబాద్‌ సిటీ: ఒంటరిగా ఉన్న మహిళను చూసి మానవత్వాన్ని మరిచి మానవ మృగాలుగా మారారు. సామూహిక లైంగికదాడికి పాల్పడడమే కాకుండా అత్యంత కిరాతకంగా ఆమె ప్రాణాలు తీశారు. ఈనెల 15న కిస్మత్‌పూర్‌ బ్రిడ్జి(Kismatpur Bridge) కింద జరిగిన మహిళ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. లైంగికదాడికి ప్రతిఘటించిందనే కోపంతో ఆమె పట్ల చాలా అనుమానుషంగా ప్రవర్తించారు. ఆమెపై సామూహికంగా లైంగిక దాడి చేయడమే కాకుండా అత్యంత క్రూరంగా నిందితులు ప్రవర్తించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.


city7.2.jpg

దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసు, రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన దిశ కేసు తరహాలోనే ఒక మహిళపై ముగ్గురు ఆటో డ్రైవర్లు చేసిన దారుణం అందరినీ ఎంతగానో కలిచివేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటన మళ్లీ పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, పలు సంఘాల వారు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలో స్వల్ప తగ్గుదల.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మతమేదైనా జాతీయతే ప్రధానం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 25 , 2025 | 09:58 AM