Hyderabad: 31 తులాల బంగారం చోరీ..
ABN , Publish Date - Nov 13 , 2025 | 07:35 AM
కిస్మత్‌పూర్ ఓం నగర్ ఎస్‌ఎం ఎంక్లేవ్‌లో దొంగలు పడ్డారు. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ 31 తులాల బంగారు ఆభరణాలను దోచుకొని పారిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓం నగర్ ఎస్‌ఎం ఎన్‌క్లేవ్‌లో కిరణ్‌కుమార్ గౌడ్ కుటుంబం నివాసం ఉంటోంది.
- ఎస్‌ఎం ఎన్‌క్లేవ్‌లో దొంగ హల్‌చల్
- మరో రెండు ఇండ్లలో దొంగతనానికి యత్నం
హైదరాబాదా: కిస్మత్‌పూర్ ఓం నగర్ ఎస్‌ఎం ఎంక్లేవ్(Kismatpur Om Nagar SM Enclave)లో దొంగలు పడ్డారు. ఓ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ 31 తులాల బంగారు ఆభరణాలను దోచుకొని పారిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఓం నగర్ ఎస్‌ఎం ఎన్‌క్లేవ్‌లో కిరణ్‌కుమార్ గౌడ్ కుటుంబం నివాసం ఉంటోంది. అతనితో పాటు భార్య, ఇద్దరు పిల్లలు, వారి తల్లిదండ్రులు ఉంటున్నారు. మంగళవారం రాత్రి అందరూ నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మెయిన్ డోర్ పక్కన ఉండే కిటికీ నుంచి డోర్ లోపలి గడియ తీసి లోపలకు ప్రవేశించాడు.

కిరణ్‌కుమార్ గౌడ్ భార్య, కుమార్తె ఉన్న గదిలోని బీరువాలో దాచిన 31 తులాల బంగారం దోచుకుని పారిపోయాడు. ఐటీ కంపెనీలో పనిచేసే కిరణ్‌కుమార్ గౌడ్ వివాహ శుభకార్యాలు ఉన్నాయని, బ్యాంకు లాకర్‌లో ఉన్న బంగారం తీసుకువచ్చి ఇంట్లో పెట్టాడు. నిద్రలేచిన కుటుంబసభ్యులు బీరువా తలుపులు తెరిచి ఉండటం చూసి బిత్తరపోయారు. 31 తులాల బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏమీ దొరకక తలుపులు పగులగొట్టి..
కిరణ్ కుమార్ గౌడ్ పక్కన ఉంటున్న రెడ్డి విజయ్(Reddy Vijay) ఇంట్లోకి కూడా దొంగ చొరబడ్డాడు. తాళాలు పగులగొట్టిన దొంగ లోపలికి వెళ్లి చూడగా ఏమీ దొరకలేదు. దీంతో ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి, తలుపులు పగులగొట్టి పారిపోయాడు. మరో ఇంట్లోకి దొంగతనానికి యత్నిస్తుండగా దొంగను చూసిన యజమాని లైట్ వేసి ఎవరు అని గట్టిగా అరవడంతో పారిపోయాడు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిమెంట్ రంగంలో రూ 1.2 లక్షల కోట్ల పెట్టుబడులు
సైబర్ దాడుల నుంచి రక్షణకు టాటా ఏఐజీ సైబర్ ఎడ్జ్
Read Latest Telangana News and National News