Share News

Hyderabad: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కన్నుమూత..

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:36 AM

భారతీయ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మృతిచెందారు. హైదరాబాద్ నగరంలోని గోల్నాక డివిజన్‌కు చెందిన బోయపల్లి లింగంగౌడ్‌(66) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు.

Hyderabad: బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కన్నుమూత..

- బీఆర్‌ఎస్‌ నేత బోయపల్లి లింగంగౌడ్‌ మృతి

హైదరాబాద్: గోల్నాక డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బోయపల్లి లింగంగౌడ్‌(66) మృతిచెందాడు. లింగంగౌడ్‌ తన ద్విచక్ర వాహనంపై శివంరోడ్‌ వైపు వెళ్లి తిరిగి వస్తుండగా కిందపడడంతో గాయాలు కాగా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. లింగంగౌడ్‌ బీఆర్‌ఎస్‏లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‏కు అతి సన్నిహితుడుగా కొనసాగుతున్నాడు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ నగరంలో లేకపోవడంతో విషయం తెలియగానే ఎమ్మెల్యే సతీమణి,


city5.jfif

మాజీ కార్పొరేటర్‌ కాలేరు పద్మావెంకటేష్‌, కార్పొరేటర్‌ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్‌ దంపతులు, పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని దగ్గరుండి పరిశీలిస్తుండగా వైద్యులు మృతిచెందాడని చెప్పగా వెంటనే అక్కడి నుంచి గోల్నాక డివిజన్‌ న్యూగంగానగర్‌లోని ఆయ న నివాసానికి మృతదేహాన్ని తీసుకవచ్చా రు. బుధవారం ఉదయం బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నాయకులు, సన్నహితులు, గౌడసంఘం పెద్దలు,


బీసీ సంఘాల నాయకులు ఆయన నివాసానికి తరలివచ్చి నివాళ్లు అర్పించారు. లింగంగౌడ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. లింగంగౌడ్‌ పార్ధీవదేహంపై ఎమ్మెల్యే సతీమణి కాలేరు పద్మావెంకటేష్‌ బీఆర్‌ఎస్‌ జెండాను కప్పి నివాళ్లులర్పించారు. అంతిమయాత్రలో ఎమ్మెల్యే తనయుడు కాలేరు మణికాంత్‌, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. హ ర్రా్‌సపెంటలోని అంబర్‌పేట హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరలు కొంచెం పెరిగాయి.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

మూగబోయిన మావోయిస్టుల కంచుకోట!

Read Latest Telangana News and National News

Updated Date - Nov 20 , 2025 | 11:43 AM