Hyderabad: తాగిన మైకంలో కారు నడుపుతూ.. యువకుడి బీభత్సం
ABN , Publish Date - Jun 27 , 2025 | 09:51 AM
రాజేంద్రనగర్ సర్కిల్‌లో గురువారం ఒకవైపు నిషా ముక్త్ భారత్‌పై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నా యి. మరో వైపు 20 సంవత్సరాల యువకుడు పుల్‌గా మద్యం తాగి కారును నడుపుతూ రోడ్డుపైన పులువురి వాహనాలను, అత్తాపూర్ ఈశ్వర్ థియోటర్ సమీంపంలో రోడ్డు ఢీవైడర్‌ను ఢీ కొట్టి ఆగిపోయాడు.
హైదరాబాద్: రాజేంద్రనగర్(Rajendranagar) సర్కిల్‌లో గురువారం ఒకవైపు నిషా ముక్త్ భారత్‌పై అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నా యి. మరో వైపు 20 సంవత్సరాల యువకుడు పుల్‌గా మద్యం తాగి కారును నడుపుతూ రోడ్డుపైన పులువురి వాహనాలను, అత్తాపూర్ ఈశ్వర్ థియోటర్ సమీంపంలో రోడ్డు ఢీవైడర్‌ను ఢీ కొట్టి ఆగిపోయాడు. కారులో ఉన్న బెలూన్స్ తెరుచుకోవడంతో అతనికేమీ కాలేదు. కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటనతో ఉప్పర్‌పల్లి నుంచి అత్తాపూర్ వరకు ట్రాఫిక్ గంటసేపు స్థంబించింది. వాహనదారులు బెంబేలెత్తిపోయారు.
చింతల్‌మెట్ ప్రాంతానికి చెందిన ఆప్సర్ షా అనే వ్యక్తి సంగారెడ్డికి చెందిన కలీముల్లా అనే స్నేహితుని వద్ద (టీఎస్ 15ఎఫ్ జీ 4771)కారు తీసుకొచ్చి ఇంటి ఎదుట ఉంచాడు. అప్సర్‌షా చూడనప్పుడు ఆయన తమ్ముడు మహబూబ్ షా (20)తాగిన మత్తులో కారు తీసుకొని ఉప్పర్‌పల్లి వైపు బయలుదేరాడు. అతడికి కారు నడపడం సరిగ్గా రాకపోవడంతో చింతల్‌మెట్ నుంచి ఉప్పర్‌పల్లి వచ్చే మార్గంలో పలువురు ద్విచక్రవాహనదారులకు తగిలించుకుంటూ ముందుకు పోనిచ్చాడు.
ఉప్పర్‌పల్లి నుంచి అత్తాపూర్ మార్గంలో ద్విచక్రవాహనదారులకు, ఆటోలకు ఢీ కొంటూ అత్తాపూర్ ఈశ్వర్ థియోటర్ దగ్గర రోడ్డు మధ్యలో ఉన్న ఢివైడర్లను ఢీ కొని కారు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో కారులో బెలూన్లు తెరచుకోవడంతో మహబూబ్ పాషాకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు ధ్వంస మైంది. ఆ రోడ్డున పోయే వారు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చా రు. మహబూబ్ పాషాకు దేహశుద్ధి చేశారు. పోలీసులొచ్చి కారును, మహబూబ్ పాషాను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
కేసు నమోదు
తప్పతాగి వచ్చిరాని డ్రైవింగ్‌తో కారు నడిపి, పలువురిని ఢీ కొనడమే కాకుం డా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన విషయంలో మహబూబ్ అలీపై కేసు నమోదు చేశామని రాజేంద్రనగర్ ఇన్‌స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపారు. మహబూబ్ అలీ కి కారు సరిగా రాదని, తాగి నడపడంవల్ల ప్రమాదం జరిగిందన్నారు. అతను మద్యం తాగి ఉండడంవల్ల ఏమీ చెప్పలేకపోతున్నాడని. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం కొందరు ఆటోలకు కారుతో తగిలించినట్టు తెలుస్తోందని, తమకు ఇప్పటి వరకు ఎవరి నుంచి ఫిర్యాదు రాలేదని అత్తాపూర్ ఇన్‌స్టెక్టర్ నాగేశ్వర్‌రావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..
Read Latest Telangana News and National News