Share News

Hyderabad: టీ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీక్‌..

ABN , Publish Date - Jul 16 , 2025 | 10:05 AM

టీ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి టీఎన్జీవోస్‌ సాయినగర్‌ కాలనీలో మంగళవారం జరిగింది. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్న చెన్నమ్మ మంగళవారం టీ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి.

Hyderabad: టీ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీక్‌..

- చెలరేగిన మంటలు.. అదుపు చేసిన ఇద్దరు యువకులు

హైదరాబాద్: టీ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి టీఎన్జీవోస్‌ సాయినగర్‌ కాలనీ(Mailardevpalli TNGOS Sainagar Colony)లో మంగళవారం జరిగింది. సత్యనారాయణ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్న చెన్నమ్మ మంగళవారం టీ తయారు చేస్తుండగా గ్యాస్‌ లీకై మంటలు చెలరేగాయి.


city6.2.jpg

ఆమె భయంతో కేకలు వేయడంతో అదే సమయంలో రోడ్డుపై వెళ్తున్న ఆదర్శకాలనీలో టెంట్‌ హౌస్‌ నిర్వహిస్తున్న బాలు, సమీపంలో నివసిస్తున్న ధనరాజ్‌ ధైర్యంగా ఇంట్లోకి వెళ్లి మంటలను అదుపు చేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. మైలార్‌దేవ్‌పల్లి ఎస్‌ఐ విశ్వనాథ్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ధైర్యంగా ఇంట్లోకి వెళ్లి మంటలను అదుపు చేసిన ఇద్దరు యువకులను పోలీసులు, స్థానికులు అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం

Read Latest Telangana News and National News

Updated Date - Jul 16 , 2025 | 10:05 AM