Hyderabad: దళారుల మోసం.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Feb 05 , 2025 | 10:22 AM
దళారుల చేతిలో మోసపోయి ఇంటిని కోల్పోయామన్న బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో చేరుకుని వారిని కాపాడారు.
- కాపాడిన పోలీసులు
- అప్పు ఇచ్చి పేపర్లపై సంతకాలు
- మోసంతో ఇల్లు రిజిస్ర్టేషన్.. బ్యాంకులో తాకట్టు
- కోటి రుణం తీసుకుని పరారీ
- రుణ చెల్లింపులు లేక ఇంటి జప్తునకు బ్యాంకు మొగ్గు
- మోసం తెలిసి బాధితుల బలవన్మరణయత్నం
హైదరాబాద్: దళారుల చేతిలో మోసపోయి ఇంటిని కోల్పోయామన్న బాధతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో చేరుకుని వారిని కాపాడారు. ఈ సంఘటన బేగంపేట పోలీస్‌స్టేషన్(Begumpet Police Station) పరిధిలో జరిగింది. బాధితులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట ప్రకాశ్‌నగర్‌కు చెందిన భరత్‌భూషణ్, అనసూయ దంపతులు తమ కుమార్తె వివాహం చేసేందుకు అప్పు కోసం 2019లో భానుప్రకాశ్, షఫీ అనే ఇద్దరు దళారులను ఆశ్రయించారు.
ఈ వార్తను కూడా చదవండి: Gold: రైలులో 13 తులాల బంగారు నగలు చోరీ
దళారులు ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని లక్ష ఒకసారి, రెండు లక్షలు చొప్పున రెండుసార్లు ఇవ్వడంతో పాటు పెళ్లి సమయంలో మరో రెండు లక్షలు ఇచ్చారు. ఇలా మొత్తం రూ.7 లక్షలు ఇచ్చారు. అనంతరం జనవరి 2019లో బాధితులను కవాడిగూడ రిజిస్ర్టేషన్ కార్యాలయానికి రప్పించి అక్కడ దినకర్, రజనీ అనే భార్యాభర్తలను పరిచయం చేసి అప్పు ఇచ్చింది వారేనని చెప్పారు. మరికొంత అమౌంట్ ఇస్తామని నమ్మబలికి ఇంటిని రజనీ పేరిట రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు.
రిజిస్ట్రేషన్ విషయం తెలియని బాధితులు నిందితులు చెప్పిన చోట సంతకాలు పెట్టారు. అయితే నిందితులు ఆ ఇంటిని ఓ బ్యాంక్‌లో తనఖా పెట్టి రూ. కోటి రుణం తీసుకున్నారు. ఆ తర్వాత నిందితులు ఈఎంఐలు చెల్లించలేదు. దాంతో ఇంటిని జప్తు చేయడానికి బ్యాంకు అధికారులు రావడంతో బాధితులు భూషణ్, అనసూయ, వారి కుమారుడు భరత్ ఆందోళనకు గురయ్యారు.
తాము ఇంటిని విక్రయించలేదని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు ముగ్గురూ మంగళవారం ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని వారిని కాపాడారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామయ్య తెలిపారు.
వార్తను కూడా చదవండి: ఎంపీ అరవింద్ వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల ఘాటు రిప్లై
ఈవార్తను కూడా చదవండి: మంత్రి పొంగులేటికి తప్పిన పెను ప్రమాదం.. అసలేం జరిగిందంటే..
ఈవార్తను కూడా చదవండి: చిక్కరు.. దొరకరు!
ఈవార్తను కూడా చదవండి: ఆయన బతికే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన లేఖ
Read Latest Telangana News and National News