Film director: పార్కింగ్ చేస్తుండగా కారులో మంటలు..
ABN , Publish Date - Jan 31 , 2025 | 07:34 AM
పార్కింగ్ చేస్తుండగా సినీ దర్శకుడికి(Film director) చెందిన కారులో మంటలు చెలరేగి కాలిపోయింది. రెస్టారెంట్, వాలెట్ పార్కింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తన కారు కాలిపోయిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

- రెస్టారెంట్, వాలెట్ పార్కింగ్ నిర్వాహకులపై ఫిర్యాదు చేసిన సినీ దర్శకుడు
హైదరాబాద్: పార్కింగ్ చేస్తుండగా సినీ దర్శకుడికి(Film director) చెందిన కారులో మంటలు చెలరేగి కాలిపోయింది. రెస్టారెంట్, వాలెట్ పార్కింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తన కారు కాలిపోయిందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగరానికి చెందిన మహ్మద్ కురానా సమీర్ హుస్సేన్(Mohammad Khurana Sameer Hussain) సినీ దర్శకుడు. ఈ నెల 27న ఆయన ఫిలింనగర్‌లోని ఇండియన్ కిచెన్ రెస్టారెంట్‌కు స్నేహితులతో కలిసి తన స్కోడా కారులో వెళ్లారు. రెస్టారెంట్ బయట వాలెట్ పార్కింగ్‌లో ఉన్న వ్యక్తి తాళం ఇచ్చి కారును పార్కింగ్‌లో పెట్టాలని కోరాడు.
ఈ వార్తను కూడా చదవండి: Minister Jupally: ఆ అధికారిని సస్పెండ్ చేయండి..
అరగంట తర్వాత హోటల్ మేనేజర్ సంజనా వచ్చి కారులో మంటలు చెలరేగాయని వారికి తెలిపింది. సమీర్ బయటకు వచ్చి చూడగా కారు రెస్టారెంట్ పార్కింగ్(Restaurant parking)లో కాకుండా కేబీఆర్ వాకింగ్ పాత్(KBR Walking Path)లో ఉంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కానీ అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. రెస్టారెంట్, వాలెట్ పార్కింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని పేర్కొంటూ సమీర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
Read Latest Telangana News and National News