Chennai News: మూడో వ్యక్తితో వివాహేతర సంబంధం.. కుమార్తెను కడతేర్చిన తండ్రి
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:15 PM
వరుసగా వివాహేతర సంబంధాలతో తనకు చెడ్డపేరు తీసుకొస్తోందని ఆగ్రహించిన ఓ తండ్రి తన కుమార్తెను హతమార్చిన ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. మార్కండయన్‌కోట ప్రాంతానికి చెందిన ప్రవీణ విభేదాల కారణంగా భర్తను వదిలి పదేళ్లుగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది.
చెన్నై: వరుసగా వివాహేతర సంబంధాలతో తనకు చెడ్డపేరు తీసుకొస్తోందని ఆగ్రహించిన ఓ తండ్రి తన కుమార్తెను హతమార్చిన ఘటన తేని జిల్లాలో చోటుచేసుకుంది. మార్కండయన్‌కోట ప్రాంతానికి చెందిన ప్రవీణ(Praveena) విభేదాల కారణంగా భర్తను వదిలి పదేళ్లుగా మరో వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో, తిరుప్పూర్‌కు చెందిన మరో వ్యక్తితో ప్రవీణకు వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఈ విషయంపై ఆమెను తండ్రి తంగయ్య పలుమార్లు మందలించాడు. అయినా అతడి మాటల్ని ఆమె పట్టించుకోలేదు.. దీంతో ఆగ్రహం చెందిన తండ్రి, శీతలపానీయంలో విషం కలిపి ప్రవీణకు తాగించి, ఆమె స్పృహతప్పిన సమయంలో చీరతో గొంతు నులిమి హతమార్చాడు. ఈ విషయం ఎవరికి తెలియకుండా కుమార్తె మృతదేహాన్ని గ్రామ శివారులో పడవేశాడు. పోలీసుల విచారణలో... కుమార్తెను తానే హతమార్చినట్లు తంగయ్య అంగీకరించడంతో అతడిని గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News