Chennai: జనరేటర్ పొగకు ఊపిరాడక తండ్రీకుమారుల మృతి
ABN , Publish Date - Jul 03 , 2025 | 10:54 AM
స్థానిక పుళల్ సమీపంలోని కదిర్‌వేడులో జనరేటర్ పొగ కారణంగా ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు.
చెన్నై: స్థానిక పుళల్ సమీపంలోని కదిర్‌వేడు(Kadirvedu)లో జనరేటర్ పొగ కారణంగా ఊపిరాడక ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. కదిర్‌వేడు బ్రిటానియా నగర్ 10వ వీధిలోని గంగా అవెన్యూ జంక్షన్ ప్రాంతంలో సెల్వరాజ్ (57) నివసిస్తున్నాడు. మాధవరంలో ట్రాన్స్‌పోర్ట్ సంస్థలో పనిచేస్తున్న సెల్వరాజ్, రెండేళ్లుగా అద్దింట్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు మాల అనే భార్య, ఇదయ (16) అనే కుమార్తె, సుమన్‌రాజ్ (15), గోకుల్ రాజ్ (13) అనే ఇద్దరు కుమారులున్నారు.
మంగళవారం రాత్రిసెల్వరాజ్, ఆయన కుమారులు సుమన్‌రాజ్, గోకుల్‌రాజ్ ఒక గదిలోను, మాల, కుమార్తె ఇదయా మరొక గదిలో నిద్రపోయారు. బుధవారం ఉదయం చాలాసేపటివరకూ సెల్వరాజ్ గది నుండి ఎలాంటి అలికిడి వినకపోవడంతో ఆయన భార్య చుట్టుపక్కల వారి సాయంతో గది తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్ళింది. ఆ గదిలో సెల్వరాజ్, ఆయన కుమారులు నోటిలో నురగలు కారుతూ శవాలుగా పడి ఉండటం చూసి దిగ్ర్భాంతి చెందారు. వెంటనే పుళల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఆ తర్వాత పోలీసులు సెల్వరాజ్ నిద్రపోయిన గది పరిశీలించగా, ఆ గదిలో ఓ మూల ఉన్న జనరేటర్ నుండి పొగ రావడం గమనించారు. బుధవారం వేకువజాము రెండు గంటలకు ఆ ప్రాంతంలో కరెంట్ పోయిందని, దీంతో సెల్వరాజ్ జనరేటర్ ఆన్ చేసి నిద్ర పోయి ఉంటాడని, ఎక్కువసేపు జనరేటర్ పనిచేయడం వల్ల గది అంతా పొగ కమ్ముకుని, ఊపిరాడక ముగ్గురూ దుర్మరణం చెంది ఉంటారని భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!
రేవంత్.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్!
Read Latest Telangana News and National News