Hyderabad: ఎస్‌ఓటీ పోలీసులమంటూ వ్యాపారికి బురిడీ.. రూ.72.76 లక్షలతో..
ABN , Publish Date - Jun 20 , 2025 | 07:44 AM
ఎస్‌ఓటీ పోలీసులమంటూ జువెల్లరీ వ్యాపారిని బురిడీ కొట్టించిన ఓ ముఠా రూ.72 లక్షలు దోచుకెళ్ళింది. ఈ ఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోయిన్‌పల్లిలో నివాసం ఉండే హరిరామ్ సికింద్రాబాద్ సెకండ్‌బజార్‌లో బంగారం షాపు నిర్వహిస్తుంటాడు.
- రూ.72.76 లక్షలతో ఉడాయించిన ముఠా
- పోలీసుల అదుపులో కొందరు ముఠా సభ్యులు
హైదరాబాద్: ఎస్‌ఓటీ పోలీసులమంటూ జువెల్లరీ వ్యాపారిని బురిడీ కొట్టించిన ఓ ముఠా రూ.72 లక్షలు దోచుకెళ్ళింది. ఈ ఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోయిన్‌పల్లిలో నివాసం ఉండే హరిరామ్(Hariram) సికింద్రాబాద్ సెకండ్‌బజార్‌లో బంగారం షాపు నిర్వహిస్తుంటాడు. బుధవారం హరిరామ్‌కు తెలిసిన రాధేశ్యామ్ ఫోన్ చేసి ‘కిలో బంగారం ఉంది, మార్కెట్ రేటు కంటే ఐదు శాతం తక్కువకే అమ్ముతా’ అని తెలిపారు.
ఇది నమ్మిన హరిరామ్ ఎస్డీ రోడ్‌లోని సింధ్ బేకరీలో రాధేశ్యామ్‌తో పాటు మరొక వ్యక్తిని కలిశాడు. వారు డబ్బులు చూపించాలని కోరడంతో అందరూ హరిరామ్ ఆఫీ్‌సకు వెళ్లారు. హరిరామ్ డబ్బులు చూపిస్తుండగా నలుగురు వ్యక్తులు వచ్చి అందులో ఒకరు తన పేరు కేశవులు జవహర్‌నగర్ ఎస్‌ఓటీ(Jawaharnagar SOT)లో పనిచేస్తున్నాని ఐడీ కార్డు చూపించాడు.

వెంటనే ఐదుగురు ముఠా సభ్యులు ముందుగా వేసుకున్న పథకం ప్రకారం హరిరామ్‌పై దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.72,76,200 డబ్బు లాక్కొని అప్పటికే కింద సిద్ధంగా ఉన్న కారు, రెండు బైకుల మీద పారిపోయారు. బాధితుడు మార్కెట్ పోలీస్‌స్టేషన్(Market Police Station)లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఠాలోని కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, పరారీలో ఉన్న మిగతా వారి కోసం మార్కెట్, టాస్క్‌ఫోర్సు పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
జైలు నుంచి విడుదలై ఎమ్మెల్యేను కలిసిన రైతులు
Read Latest Telangana News and National News